Friday 27 November 2020

ఆ చెట్ల అక్షింతల సాక్షిగా...







చిరుజల్లుల వరమిచ్చావా..నిదురగొన్న కన్నులతో నీ ముందు వాలాను..
కుంకుమ రేఖ దిద్దుకున్న ఆకాశానికి నువ్వు గిల్లిన బుగ్గను చూపించాను..
నా చిరునవ్వుల బహుమతిని నీకోసం పట్టుకొచ్చాను..
నాలుగు పాదాల మన నడక చేర్చిన చెట్ల గొడుగు కింద చేరి గువ్వపిట్టలల్లే కబుర్లాడుకున్నాము..
మంచు కురిసి రాతిరి గుతులను మోస్తున్న గడ్డి పరకల మీద పాదాలుంచి ఆడుకున్నాము..
మాటల మధ్య నవ్వుల ముత్యాలను ఏరుకున్నాము..
మన మధ్య ఉన్న ఏ ఋతువు ఇంత అందంగా ఉండదేమో..నువ్వు నవ్వినంత అందంగా..
గాలికి ఊగే చెట్ల ఆకులు వేస్తున్న వాన అక్షింతల సాక్షిగా మనది మనువెరుగని మధురమైన బంధం..

1 comment:

ఆ రోజులకో వాసనుంది

ఆ రోజులకో వాసనుంది.. 17-5-2024 శ్రీశాంతి మెహెర్ ................................. ఆ రోజులకో వాసనుంది. అమ్మలాంటి కమ్మనైన వాసన  నేతి ముద్దలు త...