Saturday, 21 November 2020

'నిన్న' నన్ను ఎత్తుకుపోయింది..




నిటారుగా ఉన్న ఆ చెట్టుకొమ్మ వంచి నాకోసం పువ్వందుకున్నావ్ చూడు...
నిన్ను నా హృదయానికి అత్తుకున్నాను...
ఎంత పరవశమో...ఏరుకున్నాను నా నోట జారిపడిన ముత్యాలను...
నువ్వు ఇప్పుడు నాకు అంత దగ్గర..ఇంతా సాహసం చేసి పెదవి విరుస్తావేం...
నీ బుగ్గపై నేనిచ్చిన ముద్దును.మరిచిపోయావా అపుడే...
ఇలా చూడూ..నాలోపలికి..నువ్విచ్చిన నిన్నటి ఉదయం నాలో నింపిన ఆనందపు రేఖలు..
నీకు తెలుసా..నిన్న నన్ను ఎత్తుకుపోయింది..నీ చొరవ చూసి..

No comments:

Post a Comment

విడుదల ఏది?

గత అనుభవాలు  ఈటెలు,బాకులై  తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా  చేసి నడిచే దారిలో  నేనో గులకరాయిని  జ్ఞాపకాలు చెదిరిన  కాగితం కట్టలతో  వేల ...