Sunday, 29 November 2020

నేను నిజమంటాను..






కొలనులో తామర పువ్వు నవ్విన
ప్రతీసారీ నీ జ్ఞాపకం తడుముతుంది..
ముసిరే చీకట్లలో ఆ చెట్లచాటున
నువ్వే దాగున్నావని భ్రమ నాకు..
మనసుని ఆరాతీస్తాను...
అది నువ్వేనా అని..
ఏమో అంటుంది మరీ
ఏం ఎరగనట్టు...
బిగి కౌగిలిని కలగంటాను..
అదీ కలేనా..
నీటిలో తామరాకును పట్టుకున్నా...
చెట్టు నీడన నిల్చున్నా నీ నీడలే..
ఆనవాళ్ళే..
ఎవరికి తెలుసు.. ఎక్కడ నక్కావో..
వెతికి వెతికి వచ్చానిటు..
ఊరంతా నిన్ను చూడలేదంటుంది...
నేను అక్కడే ఉన్నావంటాను..
వాళ్ళు భ్రమంటారు..
నేను నిజమంటాను..
కలలో నువ్విచ్చే ముద్దు
నా పెదాలపై అంటిన తడి..
అన్నీ నిజాలల్లే తోస్తాయి..
ఏం చెప్పేది...
నేను అనుభవించిన
నీ స్పర్శ నిజమేనంటాను..
ఏం...

No comments:

Post a Comment

విడుదల ఏది?

గత అనుభవాలు  ఈటెలు,బాకులై  తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా  చేసి నడిచే దారిలో  నేనో గులకరాయిని  జ్ఞాపకాలు చెదిరిన  కాగితం కట్టలతో  వేల ...