Monday 30 November 2020

చలిగిలి...




జివ్వున లాగుతున్న నేలకు తెలుసు ఇది
చలిగిలి కాలమనీ..
చల్లదనాన్నే చిరునామాగా చేసుకున్న
చెట్ల గుబుర్లకు..
చిట్టి చినుకుల్లా చలిని మోస్తన్న గడ్డి
నేలకు తెలుసు..
తెల్లరుజామున వణుకుతూ చలిమంట కాగే
పల్లెకు చలిగిలి పరిచయమే..
కొత్తగా ప్రేమను అనుభవిస్తున్న జంటలకు
తెలుసు చలిగిలి చేసే దగ్గరితనం...
రోడ్లన్నీ చలికి భయపడుతున్నాయి..
దుప్పటికప్పుకుని జోగుతున్నాయి..
మరి.. పొగమంచు కప్పేసిన ఈ
చోటంతా చలికి కుచించుకుపోతుంటే
వెచ్చదనాన్ని వెతుకుతానేం వెర్రిగా..

No comments:

Post a Comment

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...