Monday, 30 November 2020

నృత్యం చేస్తున్న గాలి..







ముతైదువ ముఖంలా పసుపు
పరుచుకుంది ఆకాశాన్నంతా...
సూర్యకాంతికి ఆకుల చాటున
దాక్కున్న పూల మొగ్గలు..
ఉదయకాంతిలో నలుపు తెలుపులు
మాయమైన చోటది..
హృదయాన్ని తాకిన చల్లగాలి
పెట్టే గిలిగింతల మధ్య..
ఉదయం మధ్యాహ్నంగా సాయంత్రంగా
రూపుమార్చుకుంది..
ప్రవాహంలో కొట్టుకు వస్తున్న
దీపాల సమూహంలా..
బడలిక తెలియని మనుషుల
మధ్య అదో సంబరం..
గాలికి ఒణికే దీపాల ముందు మైమరచి
నృత్యం చేస్తున్న గాలి..
తళుక్కున మెరుస్తున్న నుదుటి
మీది కుంకుమ రేఖతో..
ఎర్రని చీరలో ఆవల కాపుకాచి
నిలుచున్నాను..
అటుగా వచ్చే నిన్ను పట్టుకోవాలని.. నీ
చూపులకు నా చూపులు గురిపెట్టాను..
ఇకనైనా కనిపించు మరి...

No comments:

Post a Comment

విడుదల ఏది?

గత అనుభవాలు  ఈటెలు,బాకులై  తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా  చేసి నడిచే దారిలో  నేనో గులకరాయిని  జ్ఞాపకాలు చెదిరిన  కాగితం కట్టలతో  వేల ...