నిన్ను పక్కనే కూర్చుని ఉండమన్నానా..మరేంటో నువ్వు...
నా పక్కనే ఉంటూ ఏటో పోతావు..వెతుకుతాను..పట్టుకుని తీసుకువస్తాను..
మళ్ళీ మామూలే...
వెచ్చదనం కోసం వెతుకుతూ నీ భుజాన్ని నొక్కిపెడతానా..పక్కకు నెట్టేస్తావు..
ఇద్దరూ ఒక్కరమై దగ్గరగా చేరాకా..ఇంకా చలేమిటి..
రహదారులన్నీ నిశ్శబ్దాన్ని పులుముకున్నాయి..
నువ్వూ నేనూ ఇద్దరమే అతిథులుగా.. పోతున్నాం.
ఎంతటి చక్కని ఉదయం ఇది ఆస్వాదించు..
రాకూడని దారులంట ఏం వెతుకుతూ పోతున్నామో..నీకైనా తెలుసునా..
మసకచీకటిలో మౌనాన్ని తోడు తీసుకుని ఇద్దరమూ..వెచ్చదనంతో స్నేహం చేసాం..
ఊరంతా జోగుతుంది... నువ్వూ నేనూ తప్ప..
Monday, 23 November 2020
ఈ చలి మన దేహాన్ని కప్పేసింది...
Subscribe to:
Post Comments (Atom)
విడుదల ఏది?
గత అనుభవాలు ఈటెలు,బాకులై తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా చేసి నడిచే దారిలో నేనో గులకరాయిని జ్ఞాపకాలు చెదిరిన కాగితం కట్టలతో వేల ...
-
హిమజ్వాల నవల వడ్డెర చండీదాస్ రచించారు. కథ ప్రారంభంలో గజి బిజిగా అనిపించింది. నెమ్మదిగా పాత్రల స్వభావాలను అర్థం చేసుకుంటూ కథలోని ఉద్దేశాన్...
-
సత్యం శంకరమంచి "అమరావతి కథలు" పై నా సమీక్ష కినిగె పత్రికలో . “అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం. ఆ వెనుక సూర...
-
నా మొదటి కథ "పొరుగింటమ్మాయి" http://patrika.kinige.com/?p=1038&view-all=1 కినిగె పత్రికలో చదవండి. ప్రపంచం అంతా...
No comments:
Post a Comment