Sunday 15 November 2020

స్వప్నం దృశ్యమైనప్పుడు...




ప్రతిరోజూ నామీద దాడిచేసే స్వప్నం ఈరోజు దృశ్యమైంది..
ఆనందం అంచున నిలబడి నేనా దృశ్యాన్ని కళ్ళల్లో నింపుకున్నాను..
ఆ నది ఎంత ప్రశాంతంగా ప్రవహిస్తుందనీ.. దాని గట్టునే అతని ఇల్లు..
మరీ పెద్దది కాదు.. మరీ చిన్నదీ కాదు.. లోపలికి వెళ్ళి తొంగి చూడాలని ఆశ..
నిన్ను సమీపించినప్పుడు నా ఊపిరిని నీ గదిలో వదిలేయాలని..
నేను నిన్ను చేరుకోలేననే...నిన్ను ఆవరించిన భ్రమను తీసేయాలనీ..
ఎన్నో సువాసనోదయాల్లో కలలుగన్నాను.. ఊరికంతా తెలిసేలా నీతో కబుర్లాడాలని..
కానీ లోన ఏదో బెరుకు.. ఏదీ నేను నీతో ఉన్నానన్న సంబరం నీ కళ్ళల్లో..
దిగులే నిండిపోయిందే.. ఎంత వెతికినా ఆనందపు రేఖ లేదు.. అంతా సంభ్రమమే..
ఏంటో నువ్వు.. ఇంత ఆశపడ్డానా.. ఏటూ కదలనీయవనీ.. కానీ అంతాజేసి..

No comments:

Post a Comment

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...