Sunday 15 November 2020

కాచుకున్నావా నాకోసం..



అప్పుడే ఎడబాటు.. నిదురలో కలగన్నానా నిన్న నువ్వు వచ్చింది.. ఏమో
వాస్తవాన్ని ఒప్పుకో..నీలి ఆకాశాన్ని చూస్తూ..నిన్ను గురించిన కలను చెప్పానా
మెల్ల మెల్లగా వీస్తున్న గాలికి నా కురులు కదులుతుంటే నీకేంత సంబరమో
పూర్వజన్మలో మనం పదిలపరుచుకున్న జ్ఞాపకాలను వేలికి తీసుకుంటున్నాం.
బాల్యపు స్నేహితునికి మల్లే ఎన్ని కబుర్లు.. తెరమీద తెరలుగా కదిలాయి అప్పటి దృశ్యాలు.
దేహబాధలన్నీ వదిలించుకుని.. ఒంటరిగా నీ దగ్గరకు వంతన మీదగా నడిచి వస్తున్న సంగతి..
జారిపోతున్న పవిటతో నన్ను నేను మరిచిపోయి నడుస్తున్నాను వేగంగా..
నేను రాలేదని దీపకాంతిలో నన్ను గురించి వెతుకుతావని భ్రాంతి..
ఏమో.. విసిగిపోయి ఉంటావు.. ఎదురుచూపులు బాణాలమల్లే గుచ్చుకున్నాయా నిన్ను?
వేగం తెలియని నడకనాది.. నిన్ను చేరాలని మాత్రమే ప్రాయాశ పడుతున్నాను.
ఆ రాతిరి ఏకంతాన్ని ఛిద్రం చేస్తూ నీకోసం వేగంగా గాలిని ఊళలను సైతం వెంట తెచ్చుకున్నాను..
ఒక్క నిట్టూర్పుతో నా శ్రమను పలుచన చేయకు.. ఎదురుచూడు నాకోసం.. ఆ కొండ మలుపులోనే ఉన్నాను..
నీ పలుకు కోసం మరోమారు కలగంటూ ఉన్నాను.

No comments:

Post a Comment

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...