Wednesday, 18 November 2020

నీ తావులేని చోట...






నీ తావులేని చోట నాకు పక్షుల కిలకిలలు కూడా గంభీరంగా వినిపిస్తున్నాయి..
ఒదిగి కూర్చున్న గువ్వల జంటలో ఇప్పుడు మనం కనిపించడంలేదు..
ఆకాశంలో కుంకుమ వర్ణం నాకు రుధిరమై ఆనుతుంది..
మంచి నీళ్ళు చేదుగా దిగుతున్నాయి గొంతులోకి..
నువ్వు కొరికి ఇచ్చిన జామపిందెలు తిన్న ఊహ వదిలిపోవడం లేదు నన్ను..
ఆ నాపరాయి మీది మన గుర్తులు ఇప్పుడు కనిపించడంలేదు..
ఇదంతా నిజమేనా..నీకోసం అల్లుకున్న ఊహల వెంట..
మన ఏకాంత క్షణాల వెంట.. అలసటల వెంట.. నిట్టూర్పుల వెంట.. నువ్వు పంచిన ప్రశాంతత వెంట..
నా జ్ఞాపకాల్లోంచి నెమ్మదిగా తరలిపోతున్నావని.. చెరిగిపోతున్న మన గతం చెపుతుంది..

No comments:

Post a Comment

విడుదల ఏది?

గత అనుభవాలు  ఈటెలు,బాకులై  తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా  చేసి నడిచే దారిలో  నేనో గులకరాయిని  జ్ఞాపకాలు చెదిరిన  కాగితం కట్టలతో  వేల ...