Wednesday 11 November 2020

ఒక నువ్వు ఒక నేను..



ఆ చెట్టుకొమ్మల్లో గువ్వపిట్టల్లా..
గూడుకోసం ఒక్కో పుల్లా...
ఏరుకొచ్చి పేర్చుకున్న స్నేహం మనది..
ఒక్క మాటతో..ఒక్క పలుకుతోనో..
కరిగిపోయేది కాదు..నిముషాలు
మన మధ్య నీరయ్యాయి..
నీరైన క్షణాలు మధుర జ్జాపకాలే.. అయ్యాయి..
వద్దంటే విడిపోగలమా..అంతా నీ భ్రమ..
ఎన్ని ఊసులు దొల్లాయి మనమధ్య..
ఎన్ని గోరువెచ్చని ఊపిరులు..
తాకాయి మనల్ని..
నిగారింపు ఎరుగని నా అడుగులను..
అడుగు చెపుతాయి..
నీతో కలిపి వేసిన అడుగులకు లెక్కలు..
నిదుర ఎరుగని నా కళ్ళను..
అడుగు చెపుతాయి..
అవి నీ గురించి కనే కమ్మని కలలను..
ఏం కనిపిస్తుంది నీకు.. మన మధ్య కనుమరుగైపోతున్న దగ్గరితనం తప్ప..
నా నుంచీ నా ప్రాణం విడిచిపోయినట్టూ బాధగా బేలగా ఉంది..
ఒకరికి ఒకరం ఇద్దరం ఒకటి కాదనుకున్నాకా దూరంగా పోతాను..ఎడారులంట..ఏరులంటా..
ఇక ఈ మనుషులు తిరిగే చోట నాకేపనీ లేదు..మూగనైపోయి..నిర్లిప్తంగా మారిపోయి..నేను

No comments:

Post a Comment

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...