Sunday 15 November 2020

నీ కలువల వంటి కళ్లు విప్పారి నప్పుడు...




నీ లేఖనందుకున్నాకా అప్పుడు కనిపించింది నా మీద నీకున్న ప్రేమ..
మన మధ్య సాగిన ఉదయాలు సాయంత్రాలు కలగలిపి పట్టుకున్నావు..
నా ప్రతి కదలికనూ నీలో నింపుకున్నావు..
నా కన్నులు విప్పారి నప్పుడు కలువలన్నావు..
గడిచిన సమయాల్లో నేను రంభనన్నావు..
మరిచిన క్షణాలే లేవన్నావు.. నేనే నీ సమస్తం
అవునా.. నిజమేనా ఇదంతా..
మంత్రాలు వినిపిస్తున్న ఆ వీధిలో నాతో నడుస్తూ నువ్వు చెప్పిన మాటలు
ఏలా మరిచిపోను.. ఆకురాలు కాలం వైపు మన ప్రయాణం
ఇప్పటికీ ఆ వానాకాలపు మసకబారిన రోజునే తలుచుకుంటాను
నా చేతివేళ్ళను తాకినప్పటి నీ సిరినవ్వును రాసుకుంటూ వెళిపోయిన నా చూపులు
ఆ మబ్బు పట్టిన ఆకాశం కింద మన మధ్య నిలిచిపోయిన కాలాన్నీ..
ఒక జీవిత కాలపు విశేషాల్ని దాచావు మన జ్ఞాపకాల డైరీలో..ఎన్ని చొప్పించావు ఆ లేఖలో..
అన్నీ నిజాలే.. మన ఇద్దరి దగ్గరి తనాలే.. ఇందాచేసి నేను రానంటే అలుగుతావు
కలలోనైనా నా ఊసులేనిదే నిదుర సాగదంటావు.. ఏది నమ్మను.. నువ్వు నాతో ఉన్నదా.. నేను నీలో ఉన్నదా..?

No comments:

Post a Comment

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...