Sunday 22 November 2020

గతం రేపిన తుఫాను..




నిన్నటి సాయంత్రం తుఫానుకు గాలి సుడులు తిరుగుతూ..
పైకి లేస్తూ..తనలో చాలా కలిపేసుకుంటుంది.
చెట్టుచేమలు చెదిరిపోతున్నాయి..
గువ్వపిట్టలు ఎగిరిపోతున్నాయి..నీటి కొలను బెదిరిపోయింది..
ఇంత జరుగుతున్నా నేను మాత్రం అలాగే.. అదేచోట కదలకుండా శిలలా..
గతం తరమగా అలసిపోయి ఆగిపోయాను..ఆయాసంతో..అక్కడే ..ఆ ఏటి ఒడ్డున..
జోరుగాలితో కలిసి వాన చినుకుల శబ్దం నా చెవులకు గంభీరంగా తాకుతుంది.
ఎవరు పిలుస్తున్నారు నన్ను.. గతం విడిచి వాస్తవం వైపుగా రమ్మని..నువ్వేనా..అది

No comments:

Post a Comment

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...