Wednesday 4 November 2020

గుసగుసలు...



ఆ విశాలమైన నగరంలో మనం...
ఆ కలల తీరానికి హద్దులే లేవు.
గంభీరత ఎరుగని మనుషులు వారంతా..
విశాల హృదయాలు వారివి.
వెండితీగలతో అల్లిన కుటీరాలే చుట్టూ..
అందులో మనదీ ఓ కుటీరం.
లేలేత ఎరుపు వర్ణంతో పూస్తున్న పూలే ఆ బాటంతా..
మన ఇంటి ముందూ అవే
ఆకాశం వైపు చూస్తూ ఆలోచించేవారు లేరిక్కడ..
దుఖం తెలీదు వీరికి.. ఎటుచూడు ఆనందమే.
మనిద్దరం జంటని..మనదో ప్రేమమందిరమనీ.. అంతా గుసగుసలు..
నిజం చెప్పు..అలసిన నా కన్నులను చూస్తూ..
మనది ప్రేమనీ..
ఆ జలతారు అంచుల మీద నిలబడి గట్టిగా అరిచి చెప్పు..నువ్వు నేను జంటని
నీకూ నాకూ మధ్య నిశ్శబ్దమే లేదనీ..
ఆ వినిపించే గుసగుసలన్నీ..నిజాలనీ
మన మాటలు వింటూన్న ఆ గోరువంక జంటకు..
మన కౌగిలి వెచ్చదనం తగిలేలా...చెపుతావా

No comments:

Post a Comment

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...