Thursday 12 November 2020

చెదిరిపోయిన స్వప్నాల చిహ్నాన్ని..



దేవకన్యలు తిరుగాడే ఆ నేల మీదనే నేనూ ఉన్నాను..
కానీ నేను దేవకన్యను కాను..
వీణా ధ్వనుల సరాగాల్లో తేలియాడే సంగీత ప్రపంచంలోనే నేనూ ఉన్నాను..
కానీ నాకు సంగీతం రాదు.
మధుర గానాన్ని వినిపించే సరస్వతీ దేవులున్నారు నా చూట్టూ..
కానీ నాకు గానం రాదు..
పున్నాగ పూల సువాసనల్లో తేలియాడే చెట్ల గుబుర్లలో నేనున్నాను..
కానీ నాకా సువాసన లేదు..
లేలేత అందాలను విరజిమ్మి.. కన్నుల్లో కోటికాంతులు నింపుకున్న అప్సరలెందరో ఉన్నారు..
గాలి తరగలకు ఊగి ఊసులు చెప్పే ఆ నెమలి కన్నులు నాకు లేవు..
నేను ఉత్త మనిషిని.. మేలి ముసుగులో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను..
చెదిరిపోయిన స్వప్నాల చిహ్నాన్ని..
నీరుగారి పోయిన ఉత్సాహానికి చిరునామాను..
దినచర్యే లేని గాఢనిద్రలోంచి లేచిన ఓ బద్దకాన్ని...
సౌఖ్యాన్ని ఎరుగని అనారోగ్య సంకేతాన్ని...

No comments:

Post a Comment

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...