Sunday, 1 November 2020

మృత్యువాత పడ్డ దేహాన్ని....



గడ్డిపోచలను ఇనుప చువ్వలుగా మలిచి వంతెన కడుతున్నాను..
అన్నిటినీ వదిలి దాటిపోవాలనీ..ప్రయత్నం..
గాలి దూరని సందులోంచి కోరలు చాచిన మృత్యువు వైపుకు
రాలిపడుతున్న బంధాల కన్నీటి పలకరింపులు..బాల్యమంతా మోయని పూలబరువు నా మీద..
కౌమారమూలేదు..యవ్వనమూ లేదు..నాచు పట్టిన నేల మీద మృత్యువాత పడ్డ దేహాన్ని..
చీకటి అలుముకున్న సాయంత్రానికి నేనిక తెలీదు..
ముఖానికి తెల్లని తెర ముసుగులు..గరుకు పట్టిన గొంతులు..
నేనూ..నా అపురూపమైన దేహమూ ఇకలేము..చెరిగిపోతున్న బల్లమీద నా చేతి గురుతులు...
ఎందరో నాతో పాటు నడుస్తున్నారు..ఆకాశంలో చందమామ కూడా వస్తుంది.
దహనమవుతున్న బూడిదలో మాసిపోతున్న నా దేహపు ఆనవాళ్లు.

No comments:

Post a Comment

విడుదల ఏది?

గత అనుభవాలు  ఈటెలు,బాకులై  తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా  చేసి నడిచే దారిలో  నేనో గులకరాయిని  జ్ఞాపకాలు చెదిరిన  కాగితం కట్టలతో  వేల ...