Wednesday, 25 November 2020

హృదయం..

 





ఉదయం చేతికి అంటుకుందే..కాడమల్లెల సుగంధం..ఇప్పటికీ నాతోనే ఉంది..
ఎన్నిమార్లు చూసుకోను..ఈచేతిని..నీ స్పర్శను వెతుకుతూ..
నీ ఆలోచనలనంత గాఢంగా నన్ను అల్లుకుపోయింది..నీకై వేచి చూస్తున్న నా కళ్ళకు నీ రూపు మాయనట్టు..
ఆకాశమంత ఆశతో.. నీఒడిలో ఒదిగిపోవాలని..నీకోసం ఎదురుచూస్తున్నా..
మరో జన్మకూ మన ప్రయాణం ఇలానే ఉంటుందని ఎవరు చెప్పారో తెలీదు..పిచ్చి హృదయం అదే నమ్ముతుంది.

No comments:

Post a Comment

విడుదల ఏది?

గత అనుభవాలు  ఈటెలు,బాకులై  తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా  చేసి నడిచే దారిలో  నేనో గులకరాయిని  జ్ఞాపకాలు చెదిరిన  కాగితం కట్టలతో  వేల ...