Monday, 30 November 2020

పిచ్చి మనసు..





ఉత్తప్పుడు పాటలెన్నో పాడుతుంది మనసు..
అందరిలో నిన్ను బయటకు తేవాలంటే భయం దానికి..
ఈ పుష్పించిన ఉదయాల్లో నిన్ను గురించి ఊహిస్తుంది..
చీకటిలో కాంతిని నింపుకున్న కళ్ళతో వెతుకులాడుతుంది..
ఆలోచనలకు రెక్కల్ని తొడిగి.. ఊహలు చెప్పే
ఊసులన్నీ బుద్దిగా వింటుంది..
పిరికితనాన్ని మోస్తూ మాయను పూసిన నవ్వు నటిస్తుంది.
గమనింపుకొచ్చిందా?
ఇల్లంతా కాంతి నింపాలని చీకటి గదిలోంచి కలలు కంటుంది..
దీపకాంతిలో నీ నీడను కలగని..మాయమయ్యే
నీడలతో కబుర్లాడుతుంది..
శూన్యంలో ఏం వెతుకుతుందో మరి.. వెన్నెల గుబులు పుట్టిస్తుందట..
నిన్ను గుర్తుచేసి..
సమాధానంగా నువ్వు లేవంటుంది.. ఎవరు వద్దన్నారు..
ఆ గోడల ఊసులు ఎన్ని రోజులు..

1 comment:

విడుదల ఏది?

గత అనుభవాలు  ఈటెలు,బాకులై  తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా  చేసి నడిచే దారిలో  నేనో గులకరాయిని  జ్ఞాపకాలు చెదిరిన  కాగితం కట్టలతో  వేల ...