Tuesday, 29 December 2020

మంచు పలకరింపు




ఇటుగా బయలుదేరి వచ్చింది 

హిమాలయం

ప్రతి ఊరునీ కలుపుకుంటూ

చలి విత్తనాలు చల్లుతూ

గడ్డివాము, పంట పొలము, 

సిమ్మెంటు బెంచీ

నువ్వు నేనూ అన్నీ చుట్టాలే 

ఒకటే ఈ చలిగిలికి

వెచ్చగా దుప్పట్లో 

జోగుతున్న నగరాలు

పొగమంచు కమ్మేసిన దారులు

చిటపటలాడే చలిమంటలు

ఎదురుచూడని 

మంచు దేవతకు హారతులు

ప్రేమలు చిగురించి పూలుపూచే కాలం

పరువానికి రెక్కలు మొలిచే కాలం

సిగ్గు నెరిగిన వాన చినుకులు తోరణాలై 

మంచు కన్యను చుట్టుకునే సంబరం

No comments:

Post a Comment

విడుదల ఏది?

గత అనుభవాలు  ఈటెలు,బాకులై  తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా  చేసి నడిచే దారిలో  నేనో గులకరాయిని  జ్ఞాపకాలు చెదిరిన  కాగితం కట్టలతో  వేల ...