Wednesday 23 December 2020

ఏమంటావు

 




ఏరుకోడానికి ఎన్నిలేవు

ప్రతి చోటా నీవు వదిలిన

ఆనవాళ్ళే

గాలికి ఊగుతున్న ఆ 

గుమ్మంలోని గంటలు

నువ్వు  వచ్చినపుడు

ఎన్ని హొయలుపోతాయనీ

ఈ పూలబాలల మాట చెప్పనే అక్కరలెద్దు

నిన్ను చూసినప్పుడల్లా 

కొమ్మకొమ్మకూ ఒదిగి

కొత్త భంగిమలో 

నాట్యమాడతాయి 

నీ స్పర్శ తెలిసిన కుర్చీలు బల్లలు 

నువ్వంటే ఆప్యాయత చూపుతాయి

నీపాదం తగిలి పులకించని చోటుందా

అక్కడ.

ఆగదిలో 

నాలుగు గోడలకూ నువ్వు తెలుసు

నీ నగ్న దేహాన్ని ఎన్నిమార్లు పలకరించాయో

గాలి తరగల్లా., రాత్రింబవళ్ళ 

కాలానికి మధ్య జారిపోయిన

రోజులెన్ని లేవు.

ఆ వర్షమొచ్చిన రోజున 

తడిచిన దేహాల మధ్య జరిగిన

ముద్దుల యుద్ధం

గతానికి ఎదురెళ్ళి ఎన్నని 

జ్ఞాపకాలను పట్టుకురాను

ఏం నీకు మాత్రం గురుతులెవు.

అన్నీ తీపిగా ఉంటే చెదెపుడు చూస్తావు

నువ్వేమిటి?

నేనేమిటి?

ఇద్దరం సమానమే

ఈ ప్రేమకు

ఇదంతా ఏమిటని కంగారు పడకు

అలగకు

అలవాటు పడు

ఈసారి ఇద్దరం కలిపి ఏరుకుందాం

మన ప్రేమ తునకల్ని

ఏమంటావు.

1 comment:

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...