ఓ ఏకాంత క్షణంలో నీ ఊహతో
నా గుండెల
గడబిడలను దాచేస్తూ..
అలకలుపోతూ
కాలాన్ని అద్దంలో బంధించి
నీకు చూపాలని
నీ ప్రతిబింబాన్ని
గులకరాళ్లతో మలిచాను
నీవు ఎన్నిమార్లు కలలోకొచ్చిందీ
వెన్నెల బిందువులతో లెక్కించాను
అణుచుకున్న కోర్కెలకు రెక్కలిచ్చి
నీ విచ్చిన ముద్దుల్ని దీపకాంతిలో
పదిల పరుచుకున్నాను.
మనసు సవ్వడిని ఎవరికీ
వినిపించనీయక
మసక రాత్రుల్లో దాక్కున్నాను
అలల చేతుల కౌగిలింతలో
నిన్ను గుర్తుచేసుకున్నాను
పైరు పచ్చదనంలో నీ నవ్వును
ఆనవాలు కట్టాను
గాలి ఊళలలో నీ ఊసులను
దాచుకుని పులకరించాను
నీతోటి ఆలోచనలతో
ఇసుక మేడలు కట్టాను
నీ ప్రేమను అందుకుని
పన్నీరైన హృదయాన్ని
ఎత్తుకుని మళ్ళీ తిరిగొచ్చాను
Nice heart touching
ReplyDeleteSuoer
ReplyDelete