Saturday, 19 December 2020

నీ దిగులు కమ్మేసినపుడు







ఒంటరి ఆలోచనల్లో గాలికి తల
ఊగించే లతాంతం
నాతో
కబుర్లాడిన క్షణంలో
ధారాపాతంగా జారుతున్న
నీ ఊసులను దోసిళ్ళతో పట్టి
దాచుకున్న జ్ఞాపకం
హృదయాన్ని వెచ్చగా కమ్ముకుంటున్న
ఆలోచనలను పక్కన పెట్టి
మాటలను అరువు తెచ్చుకుని
చూపులతో
వెతుకుతూ
నీవు పంచిన అనురాగ మేఘాల
వెంట పరుగులు పెట్టిన
జ్ఞాపకం
నీ
క్షేమ సమాచారం తెలియక
గుంజుకున్న గుండె
పడ్డ ఇబ్బంది
నీ నుంచి పారిపోని నన్ను
పట్టుకుని ప్రేమలేఖ
రాసిన జ్ఞాపకం
వెలుతురు ఎరుగని
దారులంట నీతో
రావాలని పడిన ఆరాటం
ఈ బాధను తీయగా నీ విరహాన్ని
కమ్మగా అదుముకుంటూ
ఆ.. గోదారి గట్టున
కాచుకుని నేను

No comments:

Post a Comment

విడుదల ఏది?

గత అనుభవాలు  ఈటెలు,బాకులై  తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా  చేసి నడిచే దారిలో  నేనో గులకరాయిని  జ్ఞాపకాలు చెదిరిన  కాగితం కట్టలతో  వేల ...