Tuesday 1 December 2020

దిగులెరుగని పక్షులవి..





దిగులెరుగని పక్షులవి..

......................................


దక్షిణ దిశగా పిట్టలెగురుతాయి చూడు.. 

అప్పుడు అంటుకుంటుంది.. దిగులు నిండిన రోజుల తడి..

పక్షులే కానీ అవి స్వేచ్ఛకు ప్రతీకలు..


దిగులు గుండెకు ఉత్తేజాన్ని నింపే విహంగాలు..

వనదేవతల్లా.. విహరిస్తూ.. ఆనందాన్ని విరజిమ్మి పోతాయవి..

ముక్కులతో కట్టుకున్న గూళ్ళలో రాజ్యాలనే ఏలతాయి..


ఋతువులెన్ని మారినా ఆనందం అలానే ఉంటుంది వాటి మధ్య..

జంట జంటల్లా ఎగురుతున్న పక్షులన్నీ ప్రేమకు ఆనవాళ్ళు..

ఎగురుతాయి.. నీలి ఆకాశంలో గిరికీలు కొడతాయి..


నిరుత్సాహం ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వెళతాయి..

ఆనందాన్ని తమతో తీసుకెళతాయి.. 

చీకట్లో వెలుతురు కోసం అర్రులు చాస్తాయి.. 


చలిగాలిలో ప్రియురాలికి ప్రేమలేఖలు పంపుతాయి.. 

ఆ పచ్చని చెట్ల గుబుర్లలో కాపురముంటాయి..

దిగులెరుగని పక్షులవి..


నిన్నూ నన్నూ అట్లానే ఉండమంటాయి.. మనకే అది చేతకాదు.. 

వాటితో పోల్చుకుంటామంతే..


No comments:

Post a Comment

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...