Thursday, 24 December 2020

కలల లోకంలో బంధీని నేను



ఈ కాళ్ళకు చుట్టుకున్న 

బంధనాలు

ప్రేమగా ఎప్పుడు 

అల్లుకుంటాయో

చీకటి నుంచి 

వెలుగు వైపుకు ఎపుడు 

తీసుకుపోతాయో

తెలీదు

మసక రాత్రుల్లో 

ప్రేమతో నిమిరి

మరి రాతిరికి పగటి 

కలలైపోతాయి

ఈ బంధనాలు నన్ను 

వదిలివెళ్ళిన బంధాలు

కౌగలించుకోవు

పలకరించవు

బాధపెట్టడమే తెలుసు

సుడులు తిరుగుతూ వచ్చి

గతంలోనికి 

గుంజుకుపోతాయి

చిన్నారిగా 

నాన్న ఒడిలో ఆడిన ఆటలు

అమ్మ చేతి గోరుముద్దలు

చిట్టి చెల్లెళ్ళతో చేసిన అల్లరి 

మేఘంలా అల్లుకుపోతుంది

కల నీరైపోయాక మబ్బులు 

పట్టిన ఆకాశమల్లే దిగులు మళ్ళీ 

కమ్ముకుపోతుంది.

No comments:

Post a Comment

విడుదల ఏది?

గత అనుభవాలు  ఈటెలు,బాకులై  తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా  చేసి నడిచే దారిలో  నేనో గులకరాయిని  జ్ఞాపకాలు చెదిరిన  కాగితం కట్టలతో  వేల ...