Tuesday 2 November 2021

ప్రియా...! నిన్ను ప్రేమించాను.




గడిచిన ప్రతి రాతిరికొక కవితను
బహుకరిస్తాను అందుకో...
నీ స్మృతి లోంచి మరో జ్ఞాపకంలోకి జారిపోతూ..వసంతాన్ని వెతుకుతాను.
పారిజాతపు పరిమళాన్ని తడుముతూ
నీ వెనుకే నిలబడినప్పుడు..
మేఘ సందేశాన్ని, తారల అల్లరినీ
నీ ప్రేమలోనే చూసాను. మూసిన
తలుపుల వెనుక నీ కోసం వేచి ఉన్నాను.
గతాల ఆనవాళ్లతో
అవే బాధలు
అవే కన్నీళ్ళు నన్ను తరిమినపుడు
నిస్సారంగా...
నిర్దయగా కరిగిపోయే ఉదయాలకు
నువ్వో వ్యాపకానివి.
ఈ కోర్కెల గుయారానికి దారిచూపే దివిటీని
ఎత్తి పట్టుకో..ఎప్పటికీ చల్లారని
విరహ జ్వాలలు ఇవి
నాలోని నిశ్శబ్దాన్ని చీల్చుకు వచ్చే
ధ్వని తరంగాలకు
ఎక్కడో దూరంగా
నీ మాటలో నేను కనిపిస్తాను.

No comments:

Post a Comment

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...