Tuesday 30 November 2021

నిరీక్షిస్తూ..

 



రాతిరి అంటుకుని 
ఆరిపోయిన కోరికలా
కరిగి నీరైన చిరునవ్వుతో 
నిరీక్షిస్తాను నీకోసం.
మంచు కు‌రిసిన ఉదయం 
వెచ్చగా మారిపోయేంతదాకా
అపుడే కాలం దూరంగా 
నెట్టివేసిన ప్రేమలా
కలలెన్నో పూసి చిగురు 
కొమ్మలను చేరతాయి.
రాత్రి వెలుగు నీడల్లో
ఒంటరితనం శాపమైన వేళ
నీ ప్రేమ మత్తెక్కిస్తుంది.
రంగుల పొలిమేరల్లో 
మబ్బుల వెన్నెల పొర్లాడుతూ
నిన్ను చేరుతుంది.
ఆ క్షణాలన్నీ రాలిపోయాకా
అనేక శరత్తుల దాకా నీకోసం
నిరీక్షిస్తూ..
చీకటి దుప్పటిలో ముఖం
దాచుకుంటాను.

No comments:

Post a Comment

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...