Thursday, 11 November 2021

నీ కబుర్ల కోసం..



 ఆ నదికి ఒడ్డున సాయంత్రాలు

నిలబడి ఎదురుచూస్తాను.
పిట్టలు తెచ్చే నీ కబుర్ల కోసం
నా స్వప్నాల్లో విచ్చుకున్న
నీ సందేశాన్ని అవి
ఎత్తుకొస్తాయి.
గాలికి ఊగే తోరణమల్లే
ఊగుతుంది మనసు
ఎప్పుడో లీలగా దూరం నుంచి
నువ్వు పిలిచే పిలుపుకి
హృదయం కోతపడి
అరనిమిషం ఆగుతుంది.
చేతికి అంటిన ఆవిరి
కురిసి వెలిసిన వాన
గాలికి తలలూపే ఆకులు
నిరాశ చెందని హృదయపు
అర
కాసిన్ని జ్ఞాపకాలన్నీ ఓచోట
పోగేసి చూసుకుంటానా
అప్పుడూ....
దోసిట్లో ఇసుకమల్లే
జారిపోతావు.
హఠాత్తుగా రోదిస్తూ
ఒక్క క్షణం తీరిక లేని
సమయాల్లో కూడా నీ ఊసు
గుండెను పిండుతుంది.
అన్నీంటిలోనూ పాతను
తవ్వుకుంటో జ్ఞాపకాలను
పోగుచేసుకుంటూ...

No comments:

Post a Comment

విడుదల ఏది?

గత అనుభవాలు  ఈటెలు,బాకులై  తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా  చేసి నడిచే దారిలో  నేనో గులకరాయిని  జ్ఞాపకాలు చెదిరిన  కాగితం కట్టలతో  వేల ...