వృథాగా రాలిపోయే కాలానికి తోటమాలి ఎవరు?
కాలపు గులాబీలను దోచుకెళ్ళే పసివాడు ఎవరు?
వృథాగా రాలిపోయే కాలానికి తోటమాలి ఎవరు?
కాలపు గులాబీలను దోచుకెళ్ళే పసివాడు ఎవరు?
ఎక్కడో దూరం నుంచి నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి
వెలుగు రేఖలు..రాతిరి నా ఒంటరి కాలయాపనకు చిక్కి
మిగిలిన శోక హృదయాన తృప్తిని నింపుతూ..తాకుతుంది నన్ను.
నీలి దీపాలను తాకుతూ..దేహమంతా వెన్నెల నింపుకుంది రాత్రి.
వెలుగై వెంబడిస్తూ తరముకొచ్చింది ఉదయం.
పక్షులన్నీ ఏక కంఠంతో కిచకిచల గానం అందుకున్నాయి..
వెనక్కు వెళ్ళే కొద్దీ గత ప్రేమలు
నీ హృదయాన్ని చేరే మార్గాన్ని వెతుకుతాను.. ఆ దారులన్నీ తెలిసినట్టే ఉంటాయి..గమ్యం చేరువైనట్టే కనిస్తుంది..అయినా నేనింకా నీకు వేయి ఆమడల దూరంలోనే ఉన్నాను.
ఈ చల్లని వేళ వెన్నెలంతా
పవిట కప్పి జడలో జాజుల్ని తురిమాను..సిగ్గుతో చందమామే సగమైంది.
నాలో ఇంత చేసి చలికి ఒణుకుతావే..ఎండుటాకులా..
కదిలే పెదవులు, గుండె గడబిడలు ఈ ఒంటరితనాన్ని జీవితం చివరికంటా అరిగిపోనిద్దామంటే ఇవన్నీ అడ్డు..నా ఉనికి ఓ జ్ఞాపకం అయితే..ఎవరు వస్తారు సాక్ష్యం.
తగలబడుతున్న కలల కోటల
మధ్య లోహపు ప్రేమలు
నవ్వుతూ నిలబడ్డాయి
వెక్కిరింపుగా
మిట్ట మధ్యాహ్నపు వేళ
మ్రోగుతున్న గంటల సాక్షిగా
సగం తెగిపడిన గుండెలో
నిశ్శబ్దం పుట్టింది.
నువ్వు ఎర్రగా మండిన ప్రతిసారీ
ప్రేమంతా ఆవిరై ఆకు చివర
నీటి బిందువులా అంటుకుంది.
పగుళ్ళిచ్చిన నేల నెరల్లో దూరి
జ్వలిస్తున్న బాధను పెకిలించకు
అప్పుడే ఈ వేదనంతా
గోతిలో కప్పబడుతుంది..
రగులుతున్న కోరికల్లే మళ్ళీ
పుట్టుకొస్తుంది..
అంగీకరిస్తాను...ముక్కలైన ఈ హృదయపు గదిని దాటి నువ్వు చేరగలవనీ..ప్రపంచ ధ్వనుల్లోంచి నా రక్తం పారే నరాల మార్గాల వెంట నీపై ప్రేమ నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉంది. నీ నిరాదరణే బాకై గుచ్చుకుంది గుండెలో..వీలైతే కాస్త సాయం చేయి..ఈ బాధ నుంచి విముక్తిని ప్రసాదించు..
ఆ నదికి ఒడ్డున సాయంత్రాలు
గడ్డి పొదలు చేసే సవ్వడిని విన్నావా ఎప్పుడైనా.. గాలికి తలలూపుతూ..పొగమంచు కమ్ముకునే వేళ నీ ఊసును ఎత్తుకొస్తాయి. నీ జ్ఞాపకాలతో తలనూపుతూ నేనూ అట్లాగే..
రాతిరి పూసిన బీరపువ్వు అందం నీనవ్వుది ..
ఆకులపై కురిసే మంచు బిందువుల మల్లే
మనసులో నిలుస్తుంది ఒక్కోసారి.
జాలినెరుగని హృదయం తనది...
ఎప్పుడూ దగ్గరగా ఉన్నట్టే ఉంటుంది ఇట్టే చేజారిపోతుంది..తామరాకుపై నీటిబొట్టల్లే..
మరీ ఆలస్యం చేయకు..మనసంతా గాయాలే ఇక్కడ.. నీ రాకతోనైనా కాస్త సాత్వంతన కలుగుతుందేమోననీ నా తొందర.
ఎప్పటికైనా నీ పరిమళాన్ని సెంటుగా పూసుకోవాలి. ఎప్పటికైనా నీ సమక్షాన్ని అందరికీ చూపాలి..గాలిలో తేలివచ్చే ప్రేమను పట్టి అప్పగించాలి.
విత్తు నాటిన చేతి స్పర్శను మరిచిపోతుందా చెట్టు..
నీళ్ళులేని ఈ బావిలో ఎన్ని జీవాల రొదలు పడి ఉన్నాయో..లోలోతుకు పోయోకొద్దీ నేనూ ఉన్నాను. నా జ్ఞాపకాలను తవ్విపోస్తున్నాను. ఇకేం దొరకనున్నాయో..
ఎన్నిమార్లు ఆలోచనల్లో మోస్తూ తిరిగానో నిన్ను..ఎన్నిమార్లు కన్నీళ్లు జారవిడిచానో...ఏనాటి బంధమిది.,ఎందుకు పదే పదే గుర్తొస్తావో..నిశ్శబ్దంగా జరిగే రాతిరిలా మెల్లగా..
చంద్రుడు సముద్రపు
నా ప్రేమను విశ్వసించు..ఈ హృదయపు దుఃఖాన్ని పంచుకో..నా ప్రేమ గాఢతను నీలో నింపుకో..పద్మం వికశించినట్లుగా గుభాళిస్తాను. నేను విషాదాన్ని కాదు..కన్నీటిని నింపుకు తిరిగేందుకు.. నేను సంతోషాన్ని కాదు చిరునవ్వును పూసేందుకు..నేను ప్రేమను కాను నీ వియోగాన్ని మోసేందుకు నేను నీ అనంతమైన హృదయస్పందనల సవ్వడిని..ఎప్పుడూ నీ తలపు స్మృతిలో కాలాన్ని ముందువెనకలు చేసి నిన్ను ఆరాధించే మీరాను..
గత అనుభవాలు ఈటెలు,బాకులై తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా చేసి నడిచే దారిలో నేనో గులకరాయిని జ్ఞాపకాలు చెదిరిన కాగితం కట్టలతో వేల ...