Thursday, 22 July 2021

ఏలా మరిచిపోను.

 నీకోసం వేల క్షణాలు 

అరువు తెచ్చుకున్న 

ఆ రోజులు మళ్లీ తిరిగి 

వస్తాయని అనుకోలేదు..



అప్పటి రోజును మరిచిపోలేదు. 

వానచినుకుల అక్షింతలు 

ఈరోజు అక్షరాలుగా 

అమరిపోతాయనీ..అనుకోలేదు.

మబ్బల్లే ఎదలో చేరి కురిసిన అకాల

వర్షానికి నాలో తడవని భాగమే లేదు.

కోర్కె రెక్కలు కట్టుకుని ఎగిరిన రోజును

మరిచిపోలేదు.

నీ చేయి అందించిన రోజును

ఏలా మరిచిపోను.

గాలికి ఊగే చెట్లమాటున నిలబడి 

తడిచిన దేహాలను ఆరబెట్టుకున్న క్షణాన్ని

ముద్దుకున్న హద్దులు చెరిపి పెదాలను

చెరిసగం పంచుకున్న గడియలను

ఏలా మరిచిపోను.

No comments:

Post a Comment

విడుదల ఏది?

గత అనుభవాలు  ఈటెలు,బాకులై  తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా  చేసి నడిచే దారిలో  నేనో గులకరాయిని  జ్ఞాపకాలు చెదిరిన  కాగితం కట్టలతో  వేల ...