Thursday, 1 July 2021

ప్రియా..




 ప్రియా..

ఎట్లా మరిచిపోను 

నీ ఊపిరిని., నీ స్పర్శను

మల్లెల సుగంధం 

పరుచుకున్న సాయంత్రాలను

మబ్బు పట్టిన ఆకాశంలోకి 

చూస్తూ చేసుకున్న బాసలను

నువ్వెరిగిన మనస్సులో 

ప్రేమ ఆవరించిన ఖాళీని

ఏలా కొలవను.

ఏమనీ..

ఈ చింతలు చికాకులు 

కలబోసిన వ్యర్థ భ్రమను

అన్నిటికీ కొలమానాన్ని

ఎంతగానో రెక్కలు విదిలిస్తూ.. 

ప్రయాణించిన దూరాన్ని..

ఎట్లా మరిచిపోను.

సన్నగిల్లే వెలుగు దారుల్లో 

వెతుకులాటను

నీ ఒడి వెచ్చదనాన్ని..

నీ కంఠంలోని మాధుర్యాన్ని

దివ్వె పరిచిన వెలుగు తెరను

నిన్ను చూసినపుడు

రగిలే ప్రేమ జ్వాలను

పెరిగే గుండె లయను

ఏట్లా మరిచిపోను

No comments:

Post a Comment

విడుదల ఏది?

గత అనుభవాలు  ఈటెలు,బాకులై  తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా  చేసి నడిచే దారిలో  నేనో గులకరాయిని  జ్ఞాపకాలు చెదిరిన  కాగితం కట్టలతో  వేల ...