Friday 8 October 2021

ఎప్పుడో మరణించాను..



 ఎప్పుడో మరణించాను..

నేనని తెలియక మునుపే
నాతల్లి కడుపున మళ్ళీ
పుట్టేందుకు శక్తిని
కూడదీసుకుంటున్నాను.
నేలలో పడి ధూళి కణంలా మారి
నీ ఊపిరిలో కలిసిపోయి
నీ స్పర్శను మలినం చేస్తూ
రక్త నాళాల్లోంచి పెకిలించుకు
వచ్చాను.
ఎంత మూర్ఖత్వమోనాది
నా వొంతు వాగ్దానం చేయలేదు
మౌనంగా తల వంచుకుని నీకేసి చూస్తూ
రెక్కలు చాచుకుని ఆకాశం కేసి
ఎగిరి పోయాను.
అప్పుడే మరణించాను. ఉషస్సులేని
కళ్ళతో ప్రార్థిస్తున్నాను.
నీ రూపాన్ని మళ్ళీ నాకివ్వు
నన్ను నీ పాదాలకు కట్టి వెయ్యి
వజ్రాన్ని కాకపోయినా నీవు పూజించే
పుష్పాన్ని అవుతాను.
మళ్ళీ నీ కడుపున పుట్టే వరాన్ని ఇవ్వు

No comments:

Post a Comment

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...