Tuesday, 5 October 2021

ఎందుకు ఈరోజు సగమైంది..




నేను నించున్న వైపు ఈ కాలిబాట వెంట
ఎపుడో మనం కలిసి ప్రయాణించాం.
ఆ చెట్టు నీడన కదలకుండా
నిలబడి కబుర్లాడిన గురుతు
సందేహంతో చిందరవందరలో
నీ నవ్వు దొంగలించిన రోజు
దోబూచులాడుతున్న నిద్రలో
నడుస్తూ
చందమామ మెత్తని కాంతి పుంజంలా
వెలుగుతున్న సమయంలో
నీతో కలిసిన రాతిరి
నీ జ్ఞాపకాలను నాతో ఉంచెందుకు
నేను పడే తంటాలు
పూలలో పండ్లలో ప్రకృతిలో నిన్ను
ఉంచి ఆరాధిస్తూ
అలసి నేను

No comments:

Post a Comment

విడుదల ఏది?

గత అనుభవాలు  ఈటెలు,బాకులై  తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా  చేసి నడిచే దారిలో  నేనో గులకరాయిని  జ్ఞాపకాలు చెదిరిన  కాగితం కట్టలతో  వేల ...