ఉదయం తప్పిపోయింది..






ఈ ఉదయం..రోజూలా లేదు..
వెలుగు పరుచుకున్న ఆ నేలమీద నాతో ఎప్పుడూ ఉండే నీ నీడలేదు..
తప్పుకుంది..నీరయింది..నా నుంచీ దూరంగా పోతుంది..
ఎంత బాగుంది నిన్న నువ్వు నా చేతిలో చేయివేసి నాతో ఊసులాడిన రోజు..
ఎవరో కాదు..నా మనసేమంటుందో తెలుసా..నువ్వు దూరమవుతావనీ..
ఎంత చెప్పినా.. కథ సిద్ధం చేసి నాకు నచ్చజెపుతుంది..
ఉత్త ఈసడింపులతో నెట్టుకొస్తున్నాను..లేదు నువ్వు నాతోనే ఉన్నావనీ..
నువ్వు మనసుకు గాయం చేసుకుని ఉన్నావనీ..అది మోసుకొచ్చిన కబురు..నిజం చెప్పు..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"

పంచాయతీ మెట్లు