చిన్నప్పుడు అమ్మమ్మ, నాయనమ్మలు చెప్పిన పేదరాసి పెద్దమ్మ కథలు, తెనాలి రామకృష్ణుని కథలు, అక్బర్ బీర్బల్ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు ఎంత అల్లి చెప్పినా వాటిని అల్లి చెపుతున్నారని మనకు తెలిసినా వినసొంపుగానే కాదు, సరదానూ తెలియని ఆసక్తినీ రేపేవి. అంతే కానీ నిజంగా తెనాలి రామకృష్ణడు అంత తెలివిగలవాడా అనే అనుమానమూ రాలేదు, అక్బర్ ముందు బీర్బల్ చూపిన చతురత నిజమేనా అనే సందేహమూ మనకు కలగలేదు. పెదరాసి పెద్దమ్మ పై అల్లిన కథలను ఈనాటికీ వింటునే ఉన్నాం. మనలానే ఇతరదేశాల వారూ ఓ తెనాలి రామకృష్ణుడు, బీర్బలు లాంటి పాత్రను వారూ సృష్టించుకున్నారు. అతడే ముల్లా నసీరుద్ధీన్. చతురత, కాస్త అమాయకత్వం కలబోసిన ఈ కథల్ని మన తెలుగులో చెప్పాలని చిన్న కోరిక పుట్టింది............. ఒకరోజు తన స్నేహితులతో టీ దుకాణంలో ఉన్న నసీరుద్ధీన్ “అతిధ్యమివ్వడంలో నాకు సాటి ఎవరూలేరు” అంటూ ఢాంబికాలు పోయాడు. ఇంతలో అతని పక్కనే ఆశపోతు స్నేహితుడొకడు “చాలా మంచిది అయితే రాత్రి భోజనానికి మమ్మలందర్నీ మీ ఇంటికి తీసుకువెళ్ళవచ్చుగా,” అన్నాడు. నశీరుద్ధీన్ తన స్నేహితులందరినీ గుంపుగా కూడదీసి ఇంటికి బయలుదేరాడు. ఇంటి దరిదాపులకు వచ్చాకా, “నేను ముందుగా...