గాలించాను..చిత్రంగా

 





ఎన్నోచోట్ల గాలించాను నీకోసం..నిండైన ఆ చెట్టుకొమ్మల్లో చిక్కుకున్నావని అనుమానం...
గాలికి ఊగి కిందకు జారతావని ఆశ..వానకు నాని చెదిరిపోతావని భయం..
గాలించాను..ఆ ప్రదేశమంతా ఎక్కడా నీజాడలేదు..అంతా నిరాశే
వేగంగా పోతున్న గాలిని కబురడిగాను..నీ జాడ తెలుసేమోననీ..
అటుగా వస్తున్న బాతుల గుంపునీ అడిగి చూసాను..తమకేం తెలీవన్నాయి..
నాలుగు దిక్కులూ గాలించి..అలిసి ఇప్పుడే ఇటుగా వచ్చాను..
ఈ చెట్టు నీడలో కాసేపు సేద దీరినపుడు అనిపించింది.. నువ్వు నాలోనే ఉన్నావన్నది మరిచిపోయాననీ...చిత్రంగా..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంచాయతీ మెట్లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"