నేనెక్కడా లేను..





నేనో ఒంటరి బాటసారినై వచ్చాను ఇటు...

వేగం లేని నడక నాది..నలుగురు కబుర్లాడే చోట నేను ఇమడను..సంబరాల్లో.. సరదాల్లో...నేను లేను..
వీగిపోతున్న ఆలోచనలతో విరాగినై పోతున్నాను..ఉషోదయాలు తప్ప..నాతోడుగా మరేదీ లేదు..నిదుర తెలియని కన్నులతో..ఏటవాలు చూపులతో.. తెలియని దాలులంట నా పయనం..
నేస్తాలను ఎరుగని శాపగ్తస్తురాలిని..వలపు పలుకుల జాణతనం లేని కురూపిని.. ప్రకృతి అందాన్ని పులుముకుని మురిసిపోతున్నాను..
తోడులేని పయనంలో ఆలోచనల ఆసరాతో ప్రయాణం నాది. గమ్యం తెలియని నడక..
ఆత్మీయులు లేని ఆవాసం నాది.. నేనెక్కడా లేను..చీకటి దారుల్లో తప్ప..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంచాయతీ మెట్లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"