ఎవరు వస్తున్నారు..
ఎవరు వస్తున్నారు మన వెంట...
ఆ వచ్చేది మనమేంటో తెలిసిన ప్రేమేనా?..
లేక మోహమా?
కూడా వస్తూనే నిన్నూ నన్నూ గమనిస్తుంది చూడు..
ఏటి ఒడ్డున చేపపిల్లల ఆటల్లా.. గాలికి కొట్టుకుంటున్న కిటికీల శబ్దం చేస్తూ..
మకరందాన్ని ముక్కున పట్టించుకుని పోతున్న తుమ్మెదలా..మన వెంట పడింది.
నీడల్లే మారి..ఏటూ కదలనీయదే..వెంటపడి తరుముతుంది..
చేతుల నిండుగా పట్టుకోదాన్ని..దగ్గరకు తీసుకుని ముద్దాడు..తనివి తీరా..
వెంటపడింది కదూ...

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి