పోస్ట్‌లు

మార్చి, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అవే చూపులు.....

చిత్రం
నాలుగైపోయింది ఈ పిల్ల ఇంకా లేవడం లేదు. ఒసేయ్ లేస్తున్నావా..లేదా ?   పాలోళ్ళు వచ్చి కూచుంటారు. ఇంతలా అరుస్తున్నా వినవే..లే.. నాకు నాలుగు గేదెల పాలు పితికే పనుంది. నువ్వు మూడన్నా అందుకుంటే కాస్త సులువవుతుంది పని. ..లే..లే... నాన్నగారి మాటలు గత నాలుగేళ్ళుగా అలవాటైపోయాయి. తెల్లారి సుప్రభాతం ఏలా ఉంటుందో మరిచిపోయాను ఈ మాటలే, నాకు మెలుకొలుపు. ఏనాడు నేను లేవనని.. పడుకోవాలని ఉందని ఎందుకు చెప్పలేను. ఏమో నేనే ఇలా ఉన్నాను. మిగతా ముగ్గురూ పనులకు కాస్త దూరం. పెద్దక్క చేసినన్నాళ్ళూ చేసి పెళ్ళి చేసుకుని వెళిపోయింది, ఇక తమ్ముడు పరవాలేదు కాస్త పాలు పోయడానికి తోడొస్తాడు . చిన్నక్కకు అసలు వంటగది ఎక్కడుందో తెలీదు. ఏదైనా మాట్లాడితే అమ్మ.. అది రోగిష్టిదే ఏం చేస్తుంది పనులు అంటుంది. మరి నేను కాదా.. అడగాలి గట్టిగానే అడగేయాలి ఈరోజు... పాలు పితికి పితికి చేతివేళ్ళు వంకర్లు తిరిగిపోయాయ్.. తెల్లారుజామున నాలుగింటికి లేస్తే.. మళ్ళీ రాత్రికే పడుకోవడం. పాల పనంతా తెముల్చుకుని కాలేజీకి పోవాలి. సాయంత్రం ఇంటికి రాగానే మళ్ళీ అదే పని. ఈ పేడ, రొచ్చు కంపుతో, నేనూ అదే వాసన కొడుతున్నాను. అమ్మకు ...

గొడ్డొచ్చిన వేళ...

చిత్రం
ఆలమూరు నుంచి ఇక్కడికి వచ్చి నెలరోజులు మాత్రమే అయ్యింది. చుట్టూ పచ్చదనం మాపిల్లలతో పాటు అమ్మకు కూడా తెగ నచ్చేసింది. మొత్తం చిన్న సైజు అడివిలాంటి ఆ ప్రదేశంలో చాలా ప్రశాంతంగా ఉంది. ఎన్నోరకాల   చెట్లు, చాలా రకాల పక్షులు, పెద్ద   గదుల పెంకుటిల్లు, ఎప్పుడూ చూడని ఎన్నోజాతుల పూలు, పళ్ళు ఇంకేం కావాలి. మనిషి ప్రశాంతంగా బ్రతకడానికి. అంతా ఇక్కడే ఉండిపోవాలని అనుకున్నాం. అప్పటివరకూ అమ్మ మిషన్ కుడుతూ, నాన్న ఉద్యోగం చేసి, ఇద్దరూ కలిపి మమ్మల్ని చూసుకున్నారు. ఈ కొత్త చోటులో అదీ ఈ అడవిలాంటి ప్రదేశంలో ఎవరు కుట్టమని బట్టలు ఇస్తారు. ఆ ఆశా పోయింది. అందుకే వారంలోనే అమ్మ ఇంతటి విశాల ప్రదేశంలో తనేం వ్యాపారం చేయగలదు అనే అలోచనలో పడింది. నాన్నగారు చేస్తున్న చిన్న ఉద్యోగం మమ్మల్ని ఓ దరిచేర్చలేదని అందరికీ తెలుసు., అందుకే అమ్మ తపన. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన సాయం ఇంటికి చాలా అవసరం. “ ఈ పచ్చదనంలో మనం ఓ ఆవును పెంచుకోవచ్చండి, అదైతే పెద్దగా పెట్టుబడి లేకుండానే, ఇక్కడే మేసి, పాలు ఇస్తుంది. ఊళ్ళో ఉన్న పాలకేంద్రంలో మీరు పాలు పోసి వద్దురుగానీ.. కాస్త అందులో లాభం ఉంటే మరోటి కొని పాల వ్యాపారం పెంచుకోవ...

ఒక లవ్ జంట, లవ్ జంట....

చిత్రం
“ ఏయ్ .. సరోజా ఈ గాజులు ఏలా ఉన్నాయో చెప్పనే లేదు. బావున్నాయ్ కదా.. ” “ ఊ.. బావున్నాయ్.. ” “ మరి ఈ చెప్పులు ?” “ అవీ బావున్నాయ్... ” “ అసలు ఎక్కడివే ఇవన్నీ... ఎప్పుడు కొన్నావ్.. ” “ అదా.. అది.. మా నాన్నగారు కొన్నారే.. ” “ నిజమా.. సరే నేను అడుగుతాలే అంకుల్ ని.. ” “ వద్దే.. ఫ్లీజ్ అడగద్దు.. ” “ నిజం చెప్పేస్తా.. రవీ ఇచ్చాడే..ఎవరితోనూ చెప్పకు.. చెప్పనని ప్రామిస్ చెయ్య్.. ఫ్లీజ్ ” “ ఊ.. అలారా దారికి.. ” ....... మా క్లాసులోని తింగరి బుచ్చి జాబితాలో రమా కూడా చక్కగా కుదిరిపోతుంది. మనసు, మనిషి రెండూ బంగారమే.. పచ్చని ఛాయ, బొద్దుగా..ముద్దుగా కుదమట్టంగా ఉండే రమా అంటే ఎవరికీ పెద్దగా తెలీదు. ఏదో ఇంట్లో వాళ్ళు చదివిస్తున్నారు కాబట్టి స్కూలుకి వచ్చేది. చదువు విషయం ఏలా ఉన్నా.. రోజంతా అది వేసుకునే తెల్లచొక్కా మాత్రం మాసిపోకుండా నలిగిపోకుండా భద్రంగా చూసుకునేది. దానితో చెట్టాపట్టాలేసుకుని తిరిగే ఓపికా, ధైర్యం, తెగువలాంటివి నాకే ఉన్నాయ్.. ఎందుకంటే అది ప్రేమలో పడిన సంగతి తెలిసిన, ధైర్యవంతురాలిని, ఒక్కగానొక్క స్నేహితురాల్ని నేనే. ఏదైనా సమస్య వస్తే నేను కా...

ఆల్విన్ xరోడ్స్...

చిత్రం
ఉద్యోగం పురుష లక్షణం అని ఎవరన్నారో... ఆ మాట తప్పు.. ఉద్యోగం స్త్రీ, పురుషులిద్దరి లక్షణం అని నేనంటాను. ఉదయాన్నే పిల్లల్ని, భర్తనీ హడాముడిగా స్కూళ్ళకి, ఆఫీసులకీ సాగనంపేసి, ఇక అక్కడి నుండీ ఫోను చూసుకుంటూ, సోది చెప్పుకుంటూ, సీరియళ్ళ బాధల్లో మునిగిపోయి, ఆసమ్మా,బోసమ్మ కబుర్లలో తేలి, ఇంటికి భర్త అలిసిపోయి వచ్చే వరకూ ఆగి అప్పుడు నువ్వు నన్ను మరిచిపోయావ్.. నేనంటే నీకు ఇష్టం లేదంటూ వాణ్ణి వేపుకుతినే భార్యలకన్నా, ఉద్యోగం చేసే భార్యలే మిన్న. భర్తకి కావల్సినవి చూసి, ఉన్న సమయంలోనే పిల్లల్ని పట్టించుకుని, ఉదయాన్నే తాను రఢీ అయ్యి ఆఫీసుకు వెళుతుంది.. అక్కడ తనకో బుల్లి ప్రపంచం. చుట్టూ, మనల్ని చూసేవాళ్ళు, మనం చూసేవాళ్ళతో ఎంత బావుంటుంది. అదిగో అలా వెళుతున్నప్పుడే నాకు రోజుకో కథ కనబడుతుంది. నా ఆఫీసు కొండాపూర్, రోజూ ఉదయం యూసఫ్ గూడాలో ఆల్విన్ X రోడ్స్ బస్ ఎక్కుతాను. దాదాపు నలభై నిముషాల తర్వాత గానీ కూర్చోడానికి సీటు దొరకదు. వేలాడుతూ, ఒకరిమీద ఒకరం పడి మరీ వెళ్ళాలి. ఎంత కుక్కి తీసుకుపోతారంటే ఎవరూ పైన సపోర్ట్ కోసం ఏమీ పట్టుకోనవసరం ఉండదు. అంత రద్దీ. బస్సులో సీట్లు ఆడవారికి తక్కువే. ఒక్కోసారి ప...

పుట్టినరోజంటే....

చిత్రం
ఈరోజు నేను పుట్టానని, ఈరోజు నా పుట్టినరోజని ఎవరూ గుర్తుచేయరే... ఇంత పొద్దెక్కినా నా సంగతి ఎవరికీ గుర్తురాదే. ఛీ... వీళ్ళందరి పుట్టినరోజులూ నేను వారం ముందు నుంచే గుర్తుంచుకుంటానే.. మరి ఇదేంటి. మరీ ఇంత మతిమరుపా.. లేదా నేనంటే ఇష్టంలేదా.. ఉదయాన్నే నలుగుపెట్టి, తలస్నానం ఏది. జుట్టుకి సాంబ్రాణి ధూపం ఏది. నేను ఏం తినకుండా ఉన్నానే అక్షింతలు వెయ్యారా.. కొత్త బట్టలు ఏవి. మీ అందరి దీవెనలు కావాలమ్మా.. నన్ను దీవించండి. చాలా బాధగా ఉంది. అమ్మా.. మరి నేను నీ మొదటి బిడ్డనే నీకన్నా నా పుట్టినరోజు గుర్తులేదా.. తమ్ముడి పుట్టినరోజు రెండువారాలుందనగా గుర్తుపెట్టుకుని ముందే హడావుడి చేస్తావ్.. చిన్నతనంలో స్కూల్లో పుట్టినరోజున చాక్లెట్లు పంచుకుంటానంటే, కొత్తబట్టలు కొనమన్నా అమ్మ విసుక్కునేది. ఆ.. కొంటారు.. ఈనెల నీది, వచ్చే నేల సరిగ్గా ఇదే తేదీలో మీ చెల్లెది.. ఆపై నెల మీ చిన్న చెల్లెది. ఆగష్టులో మీ తమ్ముడి పుట్టినరోజు.. మధ్యలో ఉగాది, శ్రీరామ నవమి ఇవన్నీ కాక మా పెళ్ళిరోజు ఎన్నింటికి కొత్త బట్టలు కొంటారే.. ఇలా ప్రతిదానికీ కొత్త బట్టలంటే ఏలా.. మీ నాన్నగారు ఓ బట్టలషాపు పెట్టాలి ”’ . అమ్మ ఉపన్యాసం ఎ...

భుమిడిపాటి సోమయాజులు..

చిత్రం
నల్లబోర్డు మీద.. "స్వారోచిష మను సంభవము" ప్రవరుని స్వగతం.. అని రాసి ఉంది. అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్.... అంతా పద్యాన్నిపెద్దగా చదువుతున్నాం... తెలుగు పుస్తకంలో తల వాల్చి ఏదో చెప్పబోతున్న మా తెలుగు మాస్టారు ఉన్నట్టుండి తలపైకెత్తి చేతిలోని డస్టర్ గల్లోకి ఎగరేసారు. అది అబ్బాయిలమీదకు పోయింది. ఆడపిల్లలంతా గొల్లుమన్నాం. నోరుమూయండి ..అంటూ గట్టిగా అరిచి మళ్ళీ పుస్తకంలో తలవాల్చేసారు మాస్టారు. ఆయనకు కోపం వచ్చేపని ఎవరు చేసినా ఇలానే బోర్డు తుడిచే డస్టర్ తో కొట్టేవారు. స్కూళ్ళు తెరిచి అప్పటికి నెల కావస్తుంది. కొత్త యూనీఫాంలు, కొత్త పుస్తకాలు, కొత్త స్నేహితులు అంతా అలవాటైపోయారుగానీ ఇంకా ఈ తెలుగు పాఠం మాత్రం ఇంచి కూడా ముందుకుపోవడంలేదు. రోజూ అదే పద్యం. వింటే వచ్చినట్టే ఉన్నా, పదాలు పట్టుబడవే.. ఇక పదోతరగతిలోకి వచ్చి వేళ బాగోలేదేమో, మా తెలుగు మాస్టారు అదే భూ.సో మాస్టారి బారిన పడనివారంటూలేరు. ఇస్త్రీలేని పొడవుచేతుల చొక్కా, కాస్త పలచ...