Monday, 2 November 2020

బాటసారినై..



ఆ ఉదయాన్న నిదురచాటు కలలను చీల్చుకుని..
తూర్పు నుంచీ పడమరకు..ప్రయాణం కట్టాను..
వీధులంతా కళ్ళాపి జల్లి ముగ్గులేసి ఉన్నాయి..
ఆకాశం సృష్టి కార్యంలో నిమగ్నమై పురిటి నొప్పులతో సూర్యోదయాన్ని కంటుంది.
వడివడి అడుగులతో ప్రయాణం..దారంట వెతుకుతూ పచ్చతనాన్ని కలగన్నాను..
నిస్సారమైన చూపులను దాటుకుని బాటసారినై..
ఊరి చివర స్మశానం మీదగా నడక..తెలిసినవారు కొందరు...తెలినివారు ఎందరో..
మర్రిచెట్టు ఊడలంత పాతబడిన తరాలను దాచుకున్న ఆ నేలనంతా..
గతకాలపు ఆనవాళ్ళను కౌగలించుకుని నిద్రపోతున్నారు..

No comments:

Post a Comment

నీలోకి ఒలికిపోయాననీ..

ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది..  కొన్నిసార్లు అనిపిస్తుంది.  నేను నీలోకి ఒలికిపోయాననీ..  నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి...