ఎవరా పిలిచేదీ..



ఎవరు పిలుస్తున్నారు నన్ను.. అక్కడ ఆకాశంలో దట్టంగా అల్లుకున్న మేఘాలేనా..
లేక..వేగంగా తీరాన్ని తాకి చెదిరిపోతున్న అలలా.. ఏ క్షణానా కరగని ఊహలా..
ఉరుముతున్న మేఘాన్ని అంటిన వాన చినుకులా..గతాన్ని మరిచిపోయిన నా కన్నీళ్ళా..
అసలు ఎవరా పిలిచేది..నేను ఎవరో తెలీని ఓ అగంతక స్వరమా..
గాఢంగా నా చుట్టూ అల్లుకున్న అపోహల వలయమా..
చీకటి అలముకున్న ఆ గది గుహలో గతం తాలూకు నిట్టూర్పులు విడుస్తున్న నా కలత నిద్రా..
ఎవరా పిలిచేది..నాలో సుడులు తిరుగుతున్న గతాన్ని పక్కకు నెట్టేసిన ప్రస్తుతమా..
          

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంచాయతీ మెట్లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"