ధూళినెత్తుకు పోయిన దీపకాంతిలో...

 





కారుమబ్బుల ఆకాశంలో తారలన్నీ అసూయ పడ్డాయి గత రాత్రి..
నింగి అందం నేల మీదనే పరుచుకుంది..గమనింపుకొచ్చిందా..
మతాబులు..చిచ్చుబుడ్లు నీ ముఖాన్ని వెలిగించాయి..
నాలుగే రోజుల సంబరం..మళ్ళీ పాతబడిపోతుంది..
మురికి పేరుకుని..మకిలి పట్టిన ఆ వీధులంటా పోతూ నువ్వు గుర్తుపట్టనన్నాలేవు
నగరమంతా పరుచుకున్న ధూళిని..ఏం చేసి మాపేస్తావు.
నలుపు తెలుపుల నీ రెక్కల కింద మరెన్ని దాచేస్తావు..
దీపాల వెలుగులో మురిసిన నగర మంతా ఇప్పుడు ధూళితో నిండిందని బాధ పడకు
రానున్న రోజుల్లో చినుకు చినుకూ నిన్నూ నన్నూ తడిమి ధూళినెత్తుకుపోతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"

పంచాయతీ మెట్లు