అదే ప్రేమనీ..






కోపతాపాలు అసలు మన మధ్య రావనీ నీ వాదన కదూ..
దారులన్నీ కలిసి నీ జాడ కోసం వెతుకులాటలో పడ్డాయి..
నిన్న నువ్వు ఒంపిన కోపాన్ని ఇంకా అలాగే నింపుకుని ఉన్నాను..
నిశ్చలంగా..నిర్మలంగా..అదే ప్రేమతో
కనికరమే ఎరుగని ఈ సమయానికి నేను నీ కోపానికి బలయ్యాను..
ఎంత మధనపడితే ఏం నా హృదయం నిప్పయ్యాకా..
ఆకలిమరిచి ఆలోచించాను..ఆవేశాన్ని అటు పొమ్మన్నాను..
అప్పుడే నీలో నేను కనిపించాను..నేను ఇంతే ఉత్త ఢాంబికాలు పోతాను..అసలు నువ్వంటే ఎంత ప్రేమనీ..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"

పంచాయతీ మెట్లు