మరో ప్రపంచమే.. మరింత చేరువై... 💐❤️🤓
ఏది ఈ దేహానికి, మనసుకు సుఖాన్నిచ్చేది.. ఏది ఆనందం.. ఆహ్లాదం. పుట్టి, పెరిగి, పెళ్లి బంధంలోకిపోయి, నాన్నయి, అమ్మయి, బిడ్డల్ని సాకి.. ముసలితనంతో చచ్చేంతలోపు డబ్బు కాంక్షలోపడి, ఆశతో, అవసరాలతో కాలం గడిపేసి.. నేను గొప్పవాడినంటే.. నచ్చింది చేయలేని జీవితంలో ఇరుక్కుపోవడం ఏం ఆనందం.. ఇవన్నీ రోజూ బుర్రలో దూరేసి తెగ సాధింపు.. పూలలో సోయగం, తేనెలో తీయదనం అని అంటావేగానీ నిజంగానే పూలతో సావాసం ఉందా నీకు.. నీ పెరట్లో విచ్చుకునే పూల పేర్లు తెలుసా.. ఏ మొక్క, ఏ మొగ్గ ఏ పిందె.. తెలీదు. కానీ నీ బుర్ర వాటిని ఆస్వాదించండి మొర్రో అంటుంది.. కదిలి వెళ్లి వాటితో సమయం గడిపే సమయమేది. కొండ మీదకు అతి కష్టం మీద కాళ్ళు నొప్పులు ఒచ్చినా ఎక్కి దేవుడి గుడికి నాలుగు అడుగుల దూరంలో ఉండగా.. అంత పైనుంచి విశాలంగా కనిపిస్తున్న ప్రకృతిని చూసి మురిసిపోతాం. అంతవరకూ నొప్పితో పీకేసిన కాళ్ళు కష్టాన్ని మరిచిపోతాయి. అనంతమైన హాయి.. ఎన్ని కోట్లు పెట్టి కొన్నా దొరకని హాయి.. మనం ఎప్పుడూ గమనించని ప్రకృతి అందం అంత కష్టం తర్వాత మాత్రమే నిజరూపంతో కనిపిస్తుంది. ఇక దైవదర్శనం తర్వాతి మాట. ఇప్పుడు ప్రకృతే దేవుడు. అలాంటి అనుభవమ...