కాలానికి ఖరీదు కట్టాలి..





గాలివాటుగా నా జీవితంలో నిలిచిన నీడవు నువ్వు
కలలు నీరైనవేళ నన్ను సమీపించావు..
సముద్రమంత కన్నీటిని ఒడిసిపట్టి..నా బాధకు అడ్డుకట్ట వేసావు.
నా కన్నీళ్ళు నీవన్నావు..నీ దుఖం నాదన్నావు..
నీ చేతుల్లో పాపాయినైపోయి..మసకబారిన జీవితపు
కోణాలను తడమటం మరిచిపోయాను..కాదు మారిపోయాను.
మ్రాన్పడి పోయాను..మూగనైపోయాను..ఏమిటో
ఇదంతా అని అనుకుని తేరుకునేలోపు నీతో ప్రేమలో పడిపోయాను..
ఎవరూ నడవని దారి మనది..సాహసాల గుట్ట మీద కాపురం..
నువ్వూ నేనూ తప్ప..బంధువులను ఎరుగని అతిథ్యం..
ప్రేమ అంకురించినచోటే కూర్చుంది..కుంటుపడింది..కాలంతో కొట్టుకుపోయింది.
ఇప్పుడూ నువ్వూ నేనే..ఒకరితో ఒకరం..దగ్గరతనం ఎరుగని దూరంతో

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"

పంచాయతీ మెట్లు