ఈరోజు నువ్వు రాలేదు కదా..



నీ జాడ లేదు నాతో...అంతా వెతికి అలసిపోయాను..
ఎందుకు దూరంగా పోయావో..వెలితినంతా నాలో నింపేసి..
గాఢత తెలీని నీ ప్రేమ ఈరోజు నన్ను నిలువనీయడం లేదు..ఉన్నపళాన నీ దగ్గర కు పరుగెత్తుకురానా..
మన గుర్తులన్నీ పట్టుకుని..
నీ ఛాయ నామీద పరుచుకున్న కలతనంతా తీరుస్తుందనే ఆశతో...
ఇంద్ర ధనస్సు రంగులన్నీ పట్టుకుని వస్తున్నాను..
నా గాయపడిన హృదయానికి చికిత్స చేయాలి..
మరి..
నిన్నటి నుంచీ మరిచిపోయిన...నీకు నచ్చిన నా నవ్వు ని బహుమతిగా ఇస్తాను బదులుగా... ఏమంటావు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"

పంచాయతీ మెట్లు