ఏదీ మరోమారు నవ్వు.. నాకోసం...



ఏదీ తోచని సమయాలు నీ నవ్వునే పారే సెలయేరు సవ్వడిలా జ్ఞాపకం తెచ్చుకుంటాను..
కారు చీకటిలో కాంతి కిరణంలా తళుక్కున నీ ముఖంలో మెరిసి..
మాయమయ్యే నవ్వును వెతుకుతున్నాను..
జోరువానలో ఆకాశంలో మెరుపులా ఉంటుందది ఒక్కోసారి..
రాత్రికి తీగలపై పూసే బీరపువ్వు అందం దానిది.. నీ చిరునవ్వే
ఉషోదయాల్లో ఆకులపై నిలిచే మంచు బిందువులై నిలుస్తుంది మరోసారి..
నీలి ఆకాశంలో వానొచ్చినపుడు కనిపించే ఇంద్రధనస్సు ఇంకోసారి..
మూసిన నా కళ్ళకు నువ్వు నవ్వే నవ్వు పువ్వుల్లో దాగున్న జుంటెతేనె..
మన తొలివలపుల కాలంలో తొలగని సిగ్గుల తెరల మాటున..
ఇద్దరి మధ్యనా నలిగిన నవ్వులకు గుర్తు
ఒక్కోసారి సాయంకాలాలు ఆ నవ్వు చంద్రుని వెన్నెల కాంతి రేఖగా మారిపోతుంది.
అదృశ్యమైన వనదేవతల నవ్వువలే..నన్ను బలంగా తాకుతుంది.
ఏదీ మరోమారు నవ్వు.. నాకోసం...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"

పంచాయతీ మెట్లు