భానూదయం...



ఉదయాల్లో తెల్లగా మారిపోతావు...సాయంత్రాలు ఎరుపు వర్ణమే..
రాత్రికి నల్లని రంగు పులుముకుని నాతో జత కడతావు...
నీకోసం తలుపులు తెరచి పలకరిస్తాను ప్రతి ఉదయం...
నా కళ్ళల్లో పడాలని తెగ తాపత్రయం.. ఏంటో నీకు..
నీటి అలలపై సయ్యాటలాడుతూ మెరుస్తావు..
ఎర్ర జాంపండే గుర్తుకొస్తుంది నిన్ను చూస్తేనూ...
సీతాకోక చిలుక రెక్కల ఆటలో నీ అందం కనిపిస్తుంది..
మందారాలు పూసినా నువ్వే మెరుస్తావు..
అందానికీ నా ఆనందానికీ మధ్య నీరాక ఎప్పుడూ కొత్తగానే తోస్తుంది..
ప్రతి రాతిరీ కలగంటాను నీరాకను..తెలిసిందా..మరి నేను నీకైమవుతాను...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"

పంచాయతీ మెట్లు