Saturday, 20 March 2021

దివిటీతో ఏం వెతుకుతున్నావ్...


 

ఏం వెతుకుతున్నావ్

ఇంకిపోయిన ఇష్టాల జాడలనా

తొలిపొద్దు మలిపొద్దుగా

మారి జారిన కాలాన్నా

మనసులు కలిసి రావడమంటే

తెలిసిందే ఆ రాతలనా

ఎవరొస్తారు సాక్ష్యం

ఏమో..ఈ మనసు గురుతులు తప్ప

మరే ముంది సాక్ష్యం

జోలపాటగా మారిన ఊసులన్నీ ఏమైనట్టూ

ఊరికే ఊగాడిన మనసు బాసలన్నీ

దారి తప్పిపోయాయి.

చుట్టుకున్న చలిగాలిని ఆపాలనీ

ఆ నెగళ్ళ చుట్టూ చలికాచుకున్న

కాలాన్ని జ్ఞాపకాలలో చేర్చగలనా

ఎన్ని ప్రేమ సందేశాలు పంపాను

ఏదీ ఓ జవాబూ చేరలేదు

నీటి పొరలతో మసకబారిన 

చూపులకు ఎటు చూడు నీ రూపమే

ఎన్ని రోజులు వెతకను

ఆత్రపడే మనసు ఇప్పుడు కరువైపోయాకా

మిగిలిన ఈ శూన్యాన్ని పేర్చుకుంటూ

No comments:

Post a Comment

విడుదల ఏది?

గత అనుభవాలు  ఈటెలు,బాకులై  తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా  చేసి నడిచే దారిలో  నేనో గులకరాయిని  జ్ఞాపకాలు చెదిరిన  కాగితం కట్టలతో  వేల ...