Wednesday 6 January 2021

ఆవిరి సెగ

గాయం తగిలిన గుండెకు 

మాటలేం వస్తాయి

మునుపు నీతో ఉంది

 ఇప్పుడు ఒంటరిది

వేగంగా వీచే గాలికి 

కాస్త ఊగుతుంది

మళ్ళీ సర్దుకుంటుంది

వెలివేసిన గుండె అది

వేదన బాగా తెలుసు

ఊరూరా ఆలోచనలతో 

తిరిగి అలసి ఇంటికి చేరుతుంది

ఎన్ని కబుర్లు మోసుకొస్తుందో

అందులో నువ్వూ ఉన్నావు 

తనని ఏడిపిస్తూ

ఏ వేళకు నువ్వు ఏం చేస్తావో

ఎరుగుదును, ఆలోచిస్తుంది 

నువ్వు తిన్నావా అని

మోహార్తి తాపాల చెర నుంచీ 

విడిపించుకోవాలని 

గింజుకుంటుంది

నీ నవ్వును ఉదయానికీ 

సాయంత్రానికి ముడివేసి 

ఆడుకుంటుంది.

అప్పుడప్పుడు కలలో 

భవిష్యత్తు భయపెడుతుంది

శూన్యంలోకి లాక్కుపోతుంది

ఎంతటి ఆర్తో నువ్వంటేనూ..

గతాన్ని తలుస్తూ 

వాస్తవానికి భ్రమలను జోడించి

వెలుగునీడల సంగమంలో 

ఆవిరైపోతుంది.

No comments:

Post a Comment

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...