పోస్ట్‌లు

మరో ప్రపంచమే.. మరింత చేరువై... 💐❤️🤓

చిత్రం
ఏది ఈ దేహానికి, మనసుకు సుఖాన్నిచ్చేది.. ఏది ఆనందం.. ఆహ్లాదం. పుట్టి, పెరిగి, పెళ్లి బంధంలోకిపోయి, నాన్నయి, అమ్మయి, బిడ్డల్ని సాకి.. ముసలితనంతో చచ్చేంతలోపు డబ్బు కాంక్షలోపడి, ఆశతో, అవసరాలతో కాలం గడిపేసి.. నేను గొప్పవాడినంటే.. నచ్చింది చేయలేని జీవితంలో ఇరుక్కుపోవడం ఏం ఆనందం.. ఇవన్నీ రోజూ బుర్రలో దూరేసి తెగ సాధింపు..  పూలలో సోయగం, తేనెలో తీయదనం అని అంటావేగానీ నిజంగానే పూలతో సావాసం ఉందా నీకు.. నీ పెరట్లో విచ్చుకునే పూల పేర్లు తెలుసా.. ఏ మొక్క, ఏ మొగ్గ ఏ పిందె.. తెలీదు. కానీ నీ బుర్ర వాటిని ఆస్వాదించండి మొర్రో అంటుంది.. కదిలి వెళ్లి వాటితో సమయం గడిపే సమయమేది.  కొండ మీదకు అతి కష్టం మీద కాళ్ళు నొప్పులు ఒచ్చినా ఎక్కి దేవుడి గుడికి నాలుగు అడుగుల దూరంలో ఉండగా.. అంత పైనుంచి విశాలంగా కనిపిస్తున్న ప్రకృతిని చూసి మురిసిపోతాం. అంతవరకూ నొప్పితో పీకేసిన కాళ్ళు కష్టాన్ని మరిచిపోతాయి. అనంతమైన హాయి.. ఎన్ని కోట్లు పెట్టి కొన్నా దొరకని హాయి.. మనం ఎప్పుడూ గమనించని ప్రకృతి అందం అంత కష్టం తర్వాత మాత్రమే నిజరూపంతో కనిపిస్తుంది. ఇక దైవదర్శనం తర్వాతి మాట. ఇప్పుడు ప్రకృతే దేవుడు. అలాంటి అనుభవమ...

కొంచెం నమ్మకం ఇప్పిస్తారా..

చిత్రం
ఉత్తరం అందుకోవడం, ఏంరాసాడో చదివాకా పదమూడేళ్ళ పిల్లకి మనశ్శాంతి కరువైపోవడం ఇప్పటి రోజుల్లో పెద్దగా అనుభవంలేని పరిస్థితి..కానీ తనకదో పెద్ద సమస్య.. ఏదో ప్రమాదం వచ్చిపడిందని దిగులు కమ్మేసింది. ఇది తెలిస్తే..అమ్మ తిట్టినా, కొట్టినా తనని ప్రేమగా చూస్తుందనే నమ్మకం పోయింది. నాన్నే ప్రపంచం అనుకునే నాకు ఆ క్షణం చింతబరిక దెబ్బలు మాత్రమే గుర్తుకొచ్చాయి. ఈ కుటుంబ ప్రపంచంలో నేను మాత్రమే ఒంటరిగా, అంటరానిదానినైపోతాననేంత భయం. నా పసితనం పోయి, లాలింపులు పోయి, ఆరళ్ళు మొదలవుతాయనే భయం కుదురుగా ఉండనీయలేదు. ఈ అనుభవం  మా బంధువుల్లో ఆడపిల్లల గురించి బరితెగించారని తిట్టుకోవడం, అసహ్యంగా మాట్లాడటం వల్ల తెలిసింది. ఏం జరిగినా ఈ సంగతి ఇంట్లో చెప్పకూడదని లెటర్ని వీలైనంత ముక్కలు చేసి నూతిలోకి విసిరేసాను.  కొద్దిరోజులు రవిని తప్పించుకుని తిరిగాను. స్కూల్ గేటుముందు, మా వరండాలో కనిపించినా పలకరించకుండా వెళిపోయేదాన్ని.ఏం జరుగుతున్నా అమ్మ వెయ్యి కళ్ళూ గమనిస్తాయని తెలుసు.. ఎక్కడా కుదురులేక జరిగేది ఎవరితోనూ చెప్పుకోలేక ఏడుస్తూ గడిపాను.  (నెత్తిన పిడుగుపడిన రోజు)..ఆడపిల్ల స్వేచ్ఛ పవిట వేసిన క్షణం నుండి పోతుందని తె...

పిరికి ప్రేమ.. మొదటి భాగం

చిత్రం
బాధ చెప్పుకోలేని పసి హృదయం.. ఏడుపొస్తున్నా పంటి కింద నొక్కిపెట్టి, పెదవులకు బలవంతంగా నవ్వు పులుముకున్న నాటిది ఈ జ్ఞాపకం. అమ్మనాన్న వీళ్ళు మనకు తెలిసిన హీరో, హీరోయిన్.. వాళ్ళ ప్రేమ, కోపం, గిల్లికజ్జాలు పిల్లలు చూసినంతగా మరెవరూ సాక్ష్యం రాలేరు. అమ్మ తిడితే నాన్న వంక జాలిగా ముఖం పెట్టే రోజుల్లో.. నేనో ప్రేమలేఖ అందుకున్నాను. ప్రేమంటే అదో పిరికి ప్రేమ..  నీళ్లు లేని ఎడారిలో ప్రయాణం చేస్తుంటే వాడికి పుచ్చకాయ దొరికిందే అనుకోండి ఎంత సంబరం అలాంటి సంబరం అన్నమాట.. సదరు వ్యక్తికి నేను కనిపించడం.. చాలా రోజులు ఇంట్లో మనిషిగా అమ్మానాన్నలతో మసిలి.. స్నేహం పెంచుకుని, నేను చాపెక్కిన వారానికే తాంబూలం పళ్ళంతో ఇంటి ముందుకు వచ్చేసాడు. ఆఆఆఆ.. ప్రేమ లేఖ సంగతి చెప్పలేదు కదూ. ఇదో పెద్ద గుండెల్లో రైలు పరిగెట్టినంత భారమైన సంగతి నాకు. వాడు ఉత్తరం ఇచ్చాడు సరే.. అందులో ఏముంది.. ఏం చెప్పాలని ఈ ప్రేమలేఖ.. రోజూ మాట్లాడుతున్నాడు కదా ఇంకా ఏముంటాయ్.. ఇప్పుడు ఈ సంగతి ఎవరికి చెప్పాలి. హమ్మో.. ఈ బరువు ఎలా మోయాలి. గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఏంటి ఈ ప్రేమంటే.. ఇదేనా.. మరీ ఇంత ఇబ్బంది పెడుతుంది. చాలా వేగంగ...

దారి తప్పిన కాలానికి నాలేఖ..

చిత్రం
బాల్యానికి నా ఆలోచనతో ముడివేసాను ఈ ఉదయం. ఎప్పుడో గడిచిన కాలం కదూ. అంతా లీలగా జ్ఞాపకానికొచ్చింది. పోలిక వెతుక్కునేంతగా మాసిపోతున్న ఆనవాళ్లు .. ఆటపాటల మధ్య అల్లరి మధ్య ఏదో అమాయకత్వం.. అదిప్పుడు ఎక్కడా... మచ్చుకైనాలేదు.  చెరువుగట్టున ఊగిన ఉయ్యాల కన్నా.. బలమైన కొమ్మలకు వేలాడే కొబ్బరి తాళ్ళు చేసే శబ్దం జ్ఞాపకానికొస్తుంది. వెక్కిరిస్తూ.. నేనా కాలం దాటిపోయానని గుర్తుచేస్తూ.. నీలంరంగు యూనీఫాం మాసిన తెల్ల చొక్కా.. చెదిరి చింపిరైన తలకట్టు.. ఏదీ సరిగ్గా లేకపోయినా అసెంబ్లీలో నేనే ముందు వరసలో నించున్న ఠీవీ ఇప్పుడు ఎక్కడిది.. స్నేహితులు లేని బాల్యాన్ని ఊహించగలనా.. ఉప్పులేని కూడేకదూ.. ఏరీ నీ స్నేహితులు ఇప్పుడంతా వేరే.. అక్షరాలు పోగేసినా చెప్పలేని వెర్రి కాలం.. ప్రేమతో నిండిన పసికాలం.. ప్రేమ మాత్రమే ఉన్నకాలం.. గుండెను పిండేసే గడబిడ సమయాలు.. ఆలోచనతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రేమ సమయాలు.. దోబూచులు, దొంగాటలు, తొలిప్రేమలు, తొలి ముద్దులు... ఎన్ని ఎన్నని.. ఇప్పుడంతా వేరే.. అంతా కల్తీ.. హృదయ తృప్తి తప్ప మరేం లేదు. సోకులు, సవరింపులు, చిలిపి కలలు, కవ్విస్తూ.. కలల లోకానికి ఎత్తుకొని పోతూ.. ఊరించే ఊ...

పంచాయతీ మెట్లు

చిత్రం
ఫ్రెండ్ దగ్గర ఫిజిక్స్ పుస్తకం తీసుకుని ఇంటికి వస్తుంటే, గుర్కావోళ్ళ బీడు దాటాకా, ఎర్రమట్టి రోడ్డంపట పసుపునీళ్ళు కాలవ కట్టి, ఆ దారంతా బురదైపోయింది. ఉదయం ఇటెల్లినప్పుడు లేని బురద ఇప్పుడెలా వచ్చిందా అని సైకిల్ నెమ్మదిగా దాటిస్తుంటే.. ఆ మలుపులోంచి పెద్దగా శోకండాలు ఇనిపించాయ్. ఈ ఊళ్లో పెళ్లయినా, చావైనా ఈ శోకండాలు మామూలే. పెళ్ళయితే పిల్ల అత్తారింటికి పోతుందని, చావైతే అందరిలానే చచ్చినోడి మీద ప్రేమతోనో తీసుకున్న అప్పు ఎగొట్టాడనే బాధతోనో రకరకాలుగా ఏడుత్తారు.  ఆ ఏడుపులు కృష్ణమూర్తి ఇంటి నుంచే వచ్చేది. వాళ్లమ్మ గానీ చచ్చిపోయిందాని సైకిల్ ఆపి సందులోకి తిరిగితే చామంతి, గులాబీ పూరేకులు నేలంతా పడున్నాయ్. తెలిసిన ఆడోళ్ళంతా ఆ ఇంటి ముందు టెంటులో కూచుని ఉన్నారు. చచ్చిపోయింది వాళ్లమ్మ కాదు, కృష్ణమూర్తే! కుర్చీలో చామంతి దండేసిన కొడుకు ఫోటో ముందు తలబాదుకుంటూ ఏడుత్తుంది వాళ్ళమ్మ. పక్కనే స్టీలు గ్లాసులోని అగరబత్తుల చుట్టూ అప్పటి వరకూ వెలిగి ఆరిన బూడిద పడుంది. ఎలా చచ్చిపోయాడని మా క్లాసు సూరి గాడిని అడిగితే గుండె పోటన్నాడు. “ఆదోరం బానే ఉన్నాడు. నిన్న మధ్యాన్నం కొద్దిగా నీరసంగా ఉందని చెప్పి ఆసుపత్రికెల్లొచ్...

ఆలోచన నీ వాసనేస్తూ..

అక్షరాలను ఇక్కడే పాతిపెట్టాను. గుండెల్ని మెలితిప్పే నీ ఆలోచన ఉందే ఉదయ, సాయంత్రాల కాంతిని తినేస్తుందది ఎండవేడికి అరికాలు బొబ్బలెక్కి మండుతున్నాయి. ఇప్పుడు కూడా నువ్వు నాతో నడుస్తున్నావు ఆలోచనలు నీ వాసనేస్తూంటే పేజీల మధ్య  నెమలి ఈకను తడిమినట్టుగా నీ జ్ఞాపకాలు చివరి పేజీ వరకూ తిరగేసి నాలోని నిన్ను తడుముతూ ఎన్నాళ్ళుగా పేరుకున్న చీకటి ఇది

విడుదల ఏది?

గత అనుభవాలు  ఈటెలు,బాకులై  తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా  చేసి నడిచే దారిలో  నేనో గులకరాయిని  జ్ఞాపకాలు చెదిరిన  కాగితం కట్టలతో  వేల మైళ్ళు ప్రయాణం ఈ దారంటా పోతుంటే  గతం బొప్పిలా తగులుతుంది. నిరాశ బావిలో ఉబికి వచ్చే వేల చేతులు నన్ను లాగి తనలోకి చేర్చుకుంటాయి. నరకం మొదటి ద్వారమిది వెనక్కి రాలేని దారి..  విడుదలే లేని జైలు రక్కసి జ్ఞాపకాలు బ్రహ్మజెముడు తలలై పెరిగి పట్టుకుంటాయి. విడుదల లేదులే.. ఈ విషంలో ఊరి, ఊపిరి వదలడమే

నాకు నేనే ఎదురైతే...

నాకు నేనే ఎదురైతే చిట్టిపాదాల సవ్వడిని, అమాయకపు చిరునవ్వుని గుండెలకు అదుముకుని నాతో తీసుకెళతాను. అప్పుడు  గోదావరి నవ్వినట్టు  జలపాతాలను వేళ్ళతో తాకినట్టుగా ఉంటుందేమో ప్రేమను భుజాన వేసుకొని పోతుంటానేమో కవ్వింపుగా చూసే కళ్ళలో వేల కొంటెదనాల్ని మోస్తూ  ఏ వలపు వలలో చిక్కక.. మోహరింపుగా పోతున్న నన్ను నేనూ చూస్తుంటాను. కాంక్షను వదిలి ఆరాధనలో పడిన నన్ను చూసి నవ్వుకుంటాను. రేపటి ఉదయాలను, సాయంత్రాలను కలగంటాను. ఊహల లోకంలో తేలిపోతున్న నాకు, వాస్తవ ప్రేమలను చూపిస్తాను. ఇక్కడ ఇరుకైపోతున్న ప్రేమలను ఏకరువు పెడతాను. అప్పుడు నీ అమాయకపు అంచనాలు తప్పుతాయేమో.. కలలు చెదిరి  నిరాశతో దుఃఖం ఆవరిస్తున్న నన్ను చూసి జాలిపడతాను.

గాజు పూలు..

నిన్న మనం వెళ్ళిన దారిలోనే ఆ మలుపులో నేలను చీల్చుకుని మొలిచిందా మొక్క పూలన్నీ గాజు పూలు నీటి బిందువులే పూలైనట్టు నీటిపూలవి నీ మనసంత స్వచ్ఛత వాటికి చంద్రకాంతలు, గన్నేరులు, మంకెన్నలు, మధవీలతలకు ఉన్న సొగసంతా కలబో సుకుంది. కుమ్మరిస్తున్న సువాసనలు నీ మాటలంత మధురం అటుపోతుంటే అంటుకునే సోయగం ఎంతని నలిగిపోతానని తెలిసీ నవ్వుతుంది ప్రతి అడుగూ తన వరకూ వస్తుందని  భయపడుతూ లక్షల పాదాలకు మొక్కుతుంది. ఏ చేతికీ చిక్కకూడదని తన అందాన్ని తిట్టుకుంటుంది ఎంతటి అమాయకమో ప్రకృతిలో పూసేపూలన్నీ ఇంతేకాబోలు

కలలు..

ఎందుకు వస్తాయి కలలు ఆలోచనను పిండి కవితగా అల్లేందుకే గమ్యమంటూ లేని కలలు ఏ అతిథికీ అతిథ్యం ఇవ్వక రంగు రంగుల భావాలతో  గుసగుసలాడతాయి. జ్ఞాపకం కన్నీరు పెట్టిస్తుంటే కలలు జోలపాడతాయి. జనం మసలని దారుల్లో ప్రయాణించి అమృతం కురిసే రాత్రుల్ని అన్వేషిస్తాయి. గన్నేరుపూల సుగంధాలను తాకి, గత అనుభవాలను అల్లే అలలు పూలవాడల్లో పుప్పొడిని రాలుస్తూ,  మబ్బుల వాడల్లో విహరించే కలలు చేదును చెరిపేసి, తీపిని నింపేందుకు కసరత్తులు చేస్తాయీ కలలు దుఃఖానికి రంగుపూతను పూసి  ఊహల్లో విహరింపజేస్తాయి. అప్పుడే పిలవకు కాసేపు ఇదే కలలో ఉండనీ..  ఎంత హాయిగా ఉందనీ..

నాలాగే బంధీలు.. 3-1-2025

..................  ఈ మేడ మీంచి దారిన  పోయే వందల కళ్ళను చూస్తుంటాను. కంగారుగా కొన్ని, ఆసక్తిగా మరికొన్ని నన్నే గమనిస్తాయి.  తీగ మీద ఉడతకి, చెట్టు మీద  పావురాళ్ళకూ నేను పరిచయమే.  నా జతగాడు ఎగిరిపోయాకా..  దిగులు వేళ ఈ గమనింపులే కాలక్షేపం..  నన్ను చూస్తూ దారంటాపోయే మనుషులంతా తెలుసు నాకు ఆ గమ్యాలన్నీ తెలుసు.  దుఃఖాన్ని మోస్తూ కొందరు, ఆనందంతో కొందరు, ముఖాలు వెలిగించి, వాడిపోయి పోతుంటారు.  ఈ పంజరంలో చిలకనని  చులకన చేస్తారు కానీ..  స్వేచ్ఛ ఉండీ, ఈ ప్రపంచాన  బంధీలు వీళ్ళు ఆ కనిపించే మేఘం వెనక ఏముందో తెలుసుకోవాలని ఉంది.  వాళ్ళ మనసుల్లానే అదీ అంతుచిక్కదు.  ఎక్కడ నుంచి ఇటు వచ్చానో, ఇటు నుంచి ఎటు ప్రయాణమో తెలీదు.  వీళ్ళూ అంతే..

ఇదంతా కాలానికి మామూలే..

ఇవాళేం కొత్తగా లేదు..  గుమ్మంలో ముగ్గులు చెరిగిపోయి రాత్రికి జనం పలచబడిఎప్పట్లాగే నిద్రపోతుంది వీధి.  కాలం మారడం నీకు కొత్తేమో కానీ  కాలానికి ఇదంతా మామూలే  విడ్డూరంగా జరుపునే సందడంతా  తనకు తెలిసిందే.  రోజు మరో రోజులోకి, మరో కాలంలోకి పోతూ,  దాని వెంట నిన్ను తీసుకు పోతుంది. కొమ్మను పండి,  రాలిన ఆకుల మల్లే కాల చక్రంలో పడి, రాలిపోతాం అంతే అంతకు మించి ఏం కాదు.  ఇదంతా కాలానికి మామూలే.. తెలిసిందే..

సాక్ష్యం ఏదీ..

ఇంకిపోయిన ఇష్టాల ఆనవాళ్ళు తడుముతుంటే.. కాలానికి అడ్డంపడి చక్రాల కింద మన ప్రేమ నలుగుతుంది. తొలిపొద్దు మలిపొద్దుగా మారి జారిన కాలానికి పరుగందుకుంది..  జోలపాటగా మారిన ఊసులన్నీ ఏమైనట్టూ ఊరికే ఊగాడిన మనసు బాసలన్నీ ఎటు వైపుగా దారి తప్పిపోయాయి.. ఈ మనసు గురుతులు తప్ప మరే ముంది సాక్ష్యం చుట్టుకున్న చలిగాలిని ఆపాలనీ ఆ నెగళ్ళ చుట్టూ చలికాచుకున్న కాలాన్ని.. జ్ఞాపకాలలో చేర్చాగలనా..  ఎన్ని ప్రేమ సందేశాలు పంపాను దేనికీ జవాబు లేదు.  నీటి పొరలు కళ్ళకు అడ్డంపడి మసకబారిన చూపులకు ఎటు చూడు నీ రూపమే..  ఎన్ని రోజులని వెతకను ఆత్రపడే మనసు కరువైపోయాకా మిగిలిన ఈ శూన్యాన్ని పేర్చుకుంటూ.. పోతున్నాను.

నీలోకి ఒలికిపోయాననీ..

చిత్రం
ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది..  కొన్నిసార్లు అనిపిస్తుంది.  నేను నీలోకి ఒలికిపోయాననీ..  నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి వీడ్కోలు పలికాను. అసంపూర్ణంగా ఉన్న చాలా ప్రశ్నలకు జవాబులు వెతికాను. నీకిదంతా ఉత్త చాదస్తంగా  అనిపిస్తుంది కానీ.. రద్దీ రద్దీ దారులంట పోతున్నా  నీ ఆలోచన నిలువనీదు. ఏదో కంగారు.. పూల దారులంట నడిచినా మబ్బులు, మెరుపులు, చినుకులు..నువ్వు కమ్మేసినట్టూ ఉంటుంది.  ఉదయాలన్నీ నక్షత్రాల వేళలోకి కలిసిపోయేవేలే అనే భావన కలుగుతుంది.  విషాదాన్ని మోయగలిగేది,  కన్నీరును ఆపగలిగేదీ నీ ఊహే నాలోకి తొంగి చూసుకున్నా నువ్వే.. నమ్ము

మనసు ఆగం అయిపోనాది.. థ్యాంక్యూ 'సన్ ఆఫ్ జోజప్ప'

చిత్రం
ప్రతి జీవితానికి దాటి వచ్చిన దారి ఒకటి ఉంటుంది. పుట్టుక నుంచి చావుదాకా దాటేసి వచ్చిన బాల్యం, కౌమారం, యవ్వనం ఇలా దశలన్నీ దాటి వచ్చి అనుభవాల మధింపులో పూర్తిగా జీవిత పరమార్థం తెలుసుకుని నిలబడేందుకు పట్టే సమయం అంటూ ఒకటి ఉండే తీరుతుంది. ముఖ్యంగా ఈ దశలన్నింటిలోనూ ప్రధానమైనది బాల్యం. బాల్యాన్ని తల్లిదండ్రులు మాత్రమే మోస్తే సరిపోతుందనుకుంటారు చాలామంది. కానీ బిడ్డల చూట్టూ ఉండే వాతావరణం, పెరిగే తీరు, మాట్లాడే మాట, బంధాల పటుత్వం, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, సమాజం కూడా వాళ్ల పెరుగుదలను శాసిస్తుంది. ఇదంతా వేదంతంగా కనిపించినా ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య దశ బాల్యమే. బాల్యానికి అమ్మానాన్నల ప్రేమతో పాటు చాలా కావాలి. పుట్టుక మనచేతిలో లేనట్టే పెరిగే విధానం కూడా మన చేతిలో లేదు. నాకు తెలిసి బాల్యం ఇంత ప్రాధాన్యమైన దశ అని నేను నొక్కి చెప్పడానికి చాలా కారణాలున్నాయి. బాల్యంలో భయం తెలియక పెరిగే విధానం ఒకలా ఉంటుంది. భయం తెలిసి పెరిగిన పిల్లల తీరు మరోలా ఉంటుంది. అసలు బాల్యమే శాపంగా మారిన పిల్లల జీవితాలు కూడా నేను చూసి ఉన్నాను. మనం మామూలుగా అనుకునే చాలా విషయాలు పిల్లల మనసుల్లో ఎంతగా ముద్రవేసుకుంటాయో.. ఇప్...

బాల్యం లెక్కలు..

చిత్రం
ఇప్పటి నేను ఏ హీరోనూ ఫాలో కాను. ఫ్యాన్ అస్సలే కాను. ఏ రాజకీయ నాయకులతో నాకు పనిలేదు. ఎవరికీ నేను మద్దతులు ఇవ్వను. ఇదంతా స్వవిషయం. సరే దేవానంద్, షమ్మీ కపూర్, గోవిందా, ఇలా కొందరిని మాత్రమే ఆరాధించే నాకు చిన్ననాటి జ్ఞాపకంలో ఓ హీరో అలా నిలిచిపోయాడు. ఎంత ఆరాధనో అది. అతని పోస్టర్ ఎదురుగా కూర్చుని ఎంత ఆలోచించేదాన్నో, ఇంటి నిండా సినిమా పోస్టర్లు అతికించే రోజుల్లో పుట్టడం నా అదృష్టం అనుకుంటాను. తాటాకు తడికలకు సినిమా పోస్టర్లు అతికించేవారు, హోటళ్లకు, ఇళ్ళల్లో కూడా అలా అంటించడం అలవాటుగా ఉండేది. ఇప్పటి రోజుల్లో అయితే గోడ పాడవుతుందని, పెయింట్ పోతుందనే గొడవ అప్పుడు లేకపోవడం సంతోషం. అప్పటి ఊహ, ఆలోచనలు భలే ఆనందాన్ని ఇస్తాయి. ఇప్పటి రోజులకు పూర్తి భిన్నంగా.. కొన్ని జ్ఞాపకాలు ఎంత తీవ్రంగా బలపడిపోతాయంటే ఎంత కాలం అయినా అలా నిలిచిపోతాయి. ప్రేమ అనే మాటకొస్తే అది పుట్టేందుకు వయసుతో లెక్కలు వేస్తాం కానీ.. అప్పటికి ఆరేళ్ళు కూడా లేని నేను ఇతనితో ప్రేమలో పడిపోయాను. అతను ఎవరో ఏంటో కూడా తెలీదు. సరిగ్గా చెప్పాలంటే ఇప్పటికి, ఈరోజు వరకూ కూడా అతని కోసం చూసానంటే నమ్మండి. ఈవేళ ఏదో రీల్ చూస్తుంటే కనిపించాడు. వెతగ్గా అతన...

గన్నేరు అక్షరాలు..

చిత్రం
  అలవోకగా కవిత పుట్టడం లేదు. లోతుగా తవ్వి తీయాల్సి వస్తుంది. ఒక్కోసారి తెగి, ముక్కలై దొరుకుతాయి అక్షరాలు మరోసారి కన్నీళ్ళు పెట్టించే పంక్తులు పొంగుతాయి. విరహంతో, ప్రేమతో నిండి రేపటిపై ఆశను పట్టుకువస్తాయి. చుక్కలు రాలిపడి, నెత్తురోడుతున్నట్టు వస్తుంది ఆలోచన. అమృతాన్ని నింపే పంక్తులు, ఆలోచనలై రాలిపడే గన్నేరు అక్షరాలు లోన విషాదపు సంగతీ, హృదయాంతరపు సంతోషాన్నీ పట్టుకుంటాయీ అక్షరాలు.. అగాధం నుంచి అనంతం దాకా నాలోని చీకటి కోణాలన్నీ కవిత్వానికి ఎరుకే.. దిగులప్పుడు, ఆనందాన్ని ఎకరువు పెట్టేప్పుడూ మాటలను సంభాళించేది ఈ కవిత్వమే మరి..

గాయం

చిత్రం
చీకట్లో ఓమూల విడిచిపెట్టి పోయే దైన్యాన్ని తగిలించాను. ఒక్క చుక్క అమృతం కోసం సముద్రలోతుల్ని గాలించాను. ప్రశ్నించే నీ కళ్ళలో అమృత జాడల్ని వెతికాను‌. ఏదీ దాచుకోలేదు, జీవితాన్ని తెరచి నీముందు ఉంచాను. ఇదేం హృదయభారమో తెలీదు. ముళ్లను దాటే అవరసమే ఎప్పుడూ సంతోష ఛాయల్ని వెతుక్కోవడమే ఎప్పటికప్పుడు బాటసారినై ఒదలని పాటలా కమ్మేసుకుంది నీ జ్ఞాపకం. నీ మాటలు ఉండుండీ అర్థం కావడం లేదు. నిన్నటి ఉదయాన గుండెలకు హత్తుకున్నా కూడా.. తృప్తి కలగలేదు. హృదయాన్ని ఇచ్చేసుకోవడమే తెలిసిన నాకు గాయాల సలుపు ఎప్పుడూ పరిచయమే.. (శ్రీశాంతి మెహెర్ )

అలరాసపుట్టిళ్ళు).. అదే ఇప్పుడైతే.. సత్యవతి ఏం చేసేది..?

చిత్రం
మనసుకు ఏది హాయి.. ఏది సోగయం, ఏది మైకం, ఏది మరపు రత్నాలలో లేని సొగసు, మణులలో లేని మెరుపు, ధనంలో, బంగారంలో నగల్లోలేని ఆనందం మంచి మనసులో, ఆప్యాయతలో ఉంది. స్వచ్ఛమైన మనసులు ఎందుకు అల్లుకుంటాయో తెలుసుకునే లక్షణం కొందరికే సొంతం. నిశ్చలమైన ప్రేమ, అరమరికలు లేని ప్రేమ విజయం సాధించాలంటే.. ఈ భారతావని మెదడు పురిటి బిడ్డంతే ఉంది మరి. కులం, మతం, ధనం, అంతస్తుల తూకాల మధ్య వేలాడుతుంది. పరువు ప్రతిష్టల అంచుల తేడాలో తూగలేక ఊగిసలాడుతూనే ఉంది.  ఆడదాని మనసు ఎరిగి వివాహాలు జరిగితే ఇక చెప్పేదేముంది. ఆడదాని మనసు తెలుసుకోగలిగితే ఇక ఇంత ఉపోద్ఘాతం ఎందుకు. మనసులో మాయలేని మనిషిలేడు. ఉన్న కాస్త జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేసుకుని, ఆస్తులనీ, అంతస్తులనీ, బంగారాలని, పరువని, నరకానికి ద్వారాలు తెరిచేది మనమే.. ఆ మండువాకి సత్యవతే అందం. ఆమె లేని ఇల్లు పాడు బడింది. చెప్పుకొచ్చిన కథలో.. తొలి పేరాల్లోనే బీటలువారిన నేల, పగుళ్లు తేలిన వసారా, మండువా, గోడలు, ఎటు చూసినా ఈన్యం. ఎటు చూడు నిర్మానుష్యంతో, నిర్లక్ష్యంతో  ఉన్న ఆ చావిట్లో ప్రాణాలు అరచేత పెట్టుకుని ఆఖరి ఘడియల్లో ఉన్నాడు సుబ్బారాయుడు. అతని కోసం పట్నవాసం పోయిన తమ్ముళ...

ఆ రోజులకో వాసనుంది

ఆ రోజులకో వాసనుంది.. 17-5-2024 శ్రీశాంతి మెహెర్ ................................. ఆ రోజులకో వాసనుంది. అమ్మలాంటి కమ్మనైన వాసన  నేతి ముద్దలు తిన్న కమ్మదనం అది వెన్నెలంత చల్లదనం స్వేచ్ఛ తప్ప మరో మాట తెలీని రోజులవి కాళ్ళకు పరుగు తప్ప, అలసట తెలీదు.. బద్దకంగా పక్క దులిపిన రోజులు మిక్చర్ పొట్లం తెచ్చిన గొడవలో గోళ్ల రక్కులు, పంటి గాట్లు తమ్ముడితో కుస్తీపట్లు అమ్మతనం చేతకాని రోజుల్లో  పెద్దరికాన్ని భుజాన వేసుకుని  అరిందాతనం ఆ రోజులకో వాసనుంది.. కమ్మదనం తప్ప మరో మాట తెలీని రోజులవి.  తిరిగిరావు.. తెంపి తెచ్చుకోలేము మనకు పుట్టిన బిడ్డల్లో బాల్యాన్ని  కాసేపు చూసి మురిసిపోగలం  మహా అయితే..