విడుదల ఏది?


గత అనుభవాలు 
ఈటెలు,బాకులై 
తరుముతూనే ఉన్నాయ్
క్షణాలను కొలమానంగా 
చేసి నడిచే దారిలో 
నేనో గులకరాయిని 
జ్ఞాపకాలు చెదిరిన 
కాగితం కట్టలతో 
వేల మైళ్ళు ప్రయాణం
ఈ దారంటా పోతుంటే 
గతం బొప్పిలా తగులుతుంది.

నిరాశ బావిలో
ఉబికి వచ్చే వేల చేతులు నన్ను లాగి తనలోకి చేర్చుకుంటాయి.
నరకం మొదటి ద్వారమిది
వెనక్కి రాలేని దారి.. 
విడుదలే లేని జైలు
రక్కసి జ్ఞాపకాలు బ్రహ్మజెముడు తలలై పెరిగి పట్టుకుంటాయి.
విడుదల లేదులే.. ఈ విషంలో ఊరి, ఊపిరి వదలడమే

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంచాయతీ మెట్లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"